తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bandaa Trailer: జీ5 ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. బందా ట్రైలర్ రిలీజ్

Bandaa trailer: జీ5 ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. బందా ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu

08 May 2023, 15:35 IST

    • Bandaa trailer: జీ5 (ZEE5) ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. ఏక్ బందా కాఫీ హై అనే ఆ మూవీ ట్రైలర్ సోమవారం (మే 8) రిలీజైంది. మనోజ్ బాజ్‌పేయీ ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు.
బందా మూవీలో మనోజ్ బాజ్‌పేయి
బందా మూవీలో మనోజ్ బాజ్‌పేయి

బందా మూవీలో మనోజ్ బాజ్‌పేయి

Bandaa trailer: జీ5 (ZEE5) ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. బాబా ముసుగులో ఉన్న వ్యక్తి ఓ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేయడం అనే నేపథ్యంలో బందా మూవీ తెరకెక్కింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ బందా మూవీ తీశారు. ఇందులో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయీ ఓ లాయర్ గా కనిపిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

ఈ బందా ట్రైలర్ ను జీ5 సోమవారం (మే 8) రిలీజ్ చేసింది. బాబా చేతుల్లో అన్యాయానికి గురైన ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి ప్రయత్నించే లాయర్ గా మనోజ్ ఈ మూవీలో కనిపించాడు. ఈ రెండు నిమిషాల ట్రైలర్ చూస్తుంటే.. మనందరికీ తెలిసిన స్టోరీలానే అనిపిస్తుంది. బాబా ముసుగు వేసుకొని వేలాది అనుచరులను సంపాదించి, తాను ఏం చేసినా చెల్లుతుందనుకునే వ్యక్తిపై సాగే న్యాయ పోరాటంలో గెలుపు ఎవరిది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. జీ5 ఓటీటీలో మే 23 నుంచి బందా మూవీ స్ట్రీమింగ్ కానుంది. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (ఒకే ఒక్క వ్యక్తి చాలు) అనే క్యాప్షన్ తో జీ5 ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఓ సాధారణ లాయర్.. వేల మంది అనుచరులున్న ఓ బాబాకు చెందిన అసాధారణ కేసును ఎలా వాదించబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.

ఈ సినిమాను అపూర్వ్ సింగ్ కర్కి డైరెక్ట్ చేయగా.. దీపక్ కింగ్రానీ కథ అందించాడు. భానుషాలి స్టూడియోస్ లిమిటెడ్, జీ స్టూడియోస్ ఈ సినిమాను తెరకెక్కించాయి. ఈ మధ్యే ఈ బందా మూవీ గురించి మనోజ్ బాజ్‌పేయీ స్పందించాడు. ఈ కథ వినగానే తాను నటించడానికి అంగీకరించినట్లు చెప్పాడు. ఈ మధ్యే డీస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వచ్చిన గుల్‌మొహర్ మూవీలో కనిపించిన మనోజ్.. త్వరలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3తో రాబోతున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.