తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Avatar 2 Ott Streaming: ఇండియన్ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చిన అవతార్ 2.. ఏ ఓటీటీలో అంటే?

Avatar 2 OTT Streaming: ఇండియన్ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చిన అవతార్ 2.. ఏ ఓటీటీలో అంటే?

31 March 2023, 14:36 IST

google News
  • Avatar 2 OTT Streaming: ప్రముఖ హాలీవుడ్ చిత్రం అవతార్ 2 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ముందు విదేశాల్లో స్ట్రీమింగ్ కాగా.. తాజాగా భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. పే పర్ వ్యూ ప్రాతిపదికన ఈ సినిమాను ఓటీటీలో చూడవచ్చు.

అవతార్ ది వే ఆఫ్ వాటర్
అవతార్ ది వే ఆఫ్ వాటర్

అవతార్ ది వే ఆఫ్ వాటర్

Avatar 2 OTT Streamig:హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన అవతాద్ ది వే ఆఫ్ వాటర్(Avatar The Way of Water) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అయితే విదేశాల్లో ఈ సినిమా మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. భారతీయ యూజర్లకు మాత్రం అప్పుడు అవకాశం కల్పించలేదు. తాజాగా ఇండియన్స్‌ కూడా ఈ సినిమా ఓటీటీలో చేసేలా అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. అయితే ఈ ఉచితంగా కాదు.. పే పర్ వ్యూ(Pay-per-view) కింద ఈ అవతార్ 2ను వీక్షించవచ్చు. ప్రముఖ ఓటీటీ వేదికలు యాపిల్ టీవీ ప్లస్(Apple TV+), ఐట్యూన్స్, యూట్యూబ్‌లో దీన్ని చూడవచ్చు.

యాపిల్ టీవీ ప్లస్‌ లేదా ఐట్యూన్స్‌లో ఈ సినిమాను చూడాలంటే యూజర్లు రూ.590లు చెల్లించాలి. అదే యూట్యూబ్‌లో HD వెర్షన్‌లో సినిమాను వీక్షించాలంటే ఒక్కో యూజర్ రూ.850లు, SD వెర్షన్‌లో చూడాలంటే రూ.690లు చెల్లించాలి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార‌లో ఇప్పుడప్పుడే అవతార్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఈ మూవీ మరికొన్ని రోజులు థియేటర్లలో ఉంచడానికి డిస్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో ఉచితంగా చూడటానికి కూడా ఇంకొన్ని రోజులు పట్టనుంది.

ప్రస్తుతం విదేశాల్లోనూ అవతార్ పే పర్ వ్యూ కింద ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఓవ‌ర్‌సీస్‌లో ఈ ముూవీని చూడాలంటే 19.99 డాల‌ర్లు చెల్లించాల‌ని డిస్నీ మూవీస్ పేర్కొన్న‌ది. 19.99 డాల‌ర్లు అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో ఈ సినిమా చూడ‌టం కోసం 1600 రూపాయ‌ల‌కుపైనే డ‌బ్బులు చెల్లించాలి.

అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2.310 బిలియన్ డాలర్లు(దాదాపు 18 వేల కోట్లు) రాబట్టింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు సృష్టించింది. అవతార్ 2 కంటే ముందు అవతార్, ది అవేంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం