తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc16 Music Director: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ ఆయనే.. అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్

RC16 Music Director: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ ఆయనే.. అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్

06 January 2024, 15:48 IST

    • RC16: బుచ్చిబాబు దర్శకత్వంలో స్టార్ హీరో రామ్ చరణ్ చేయబోయే మూవీ గురించి మరో అప్‍డేట్ వెల్లడైంది. ఈ సినిమాకు సంగీతం అందించే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
RC16 Music Director: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ ఆయనే.. అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్
RC16 Music Director: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ ఆయనే.. అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్

RC16 Music Director: రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ ఆయనే.. అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్

RC16: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‍లో రానున్న చిత్రంపై క్రేజ్ విపరీతంగా ఉంది. తన తొలి సినిమా ఉప్పెనతోనే భారీ బ్లాక్‍బాస్టర్ కొట్టడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును బుచ్చిబాబు దక్కించుకున్నారు. రెండో సినిమానే రామ్‍చరణ్‍ను డైరెక్ట్ అవకాశం సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ అయ్యారు చరణ్. రామ్‍చరణ్‍కు ఇది 16వ చిత్రం కావడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఆర్‌సీ16గా పిలుస్తున్నారు. కాగా, ఈ చిత్రం గురించి నేడు (జనవరి 6) ఓ కీలకమైన అఫీషియల్ అప్‍డేట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Devara vs NBK 109: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

ఆర్‌సీ16 చిత్రానికి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. నేడు (జనవరి 6) రెహ్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ అప్‍డేట్ ఇచ్చింది. “మొజార్ట్ ఆఫ్ మద్రాస్, అకాడమీ అవార్డ్ విన్నింగ్ ఏఆర్ రెహ్మాన్‍ను ఈ మూవీలోకి ఆహ్వానిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే. ఈ లెజెండ్ వల్ల ఆర్‌సీ16లో మ్యూజిక్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది” అని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ సందర్భంగా రెహ్మాన్‍కు హ్యాపీ బర్త్ డే చెబుతూ.. గిటార్‌తో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

ఆర్‌సీ16 చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తారని చాలాకాలం క్రితమే సమాచారం వెల్లడైంది. ఒకానొక సందర్భంలో స్వయంగా ఏఆర్ రెహ్మానే ఈ విషయాన్ని చెప్పారు. అయితే, మూవీ యూనిట్ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ మూవీలో కీలకపాత్ర చేయనున్నారు. ఈ విషయం కూడా తాజాగా వెల్లడైంది.

ఆర్‌సీ16 చిత్రం స్పోర్ట్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు మూవీని నిర్మిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్‍చరణ్ గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు. రెహ్మాన్‍కు కూడా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. దీంతో, ఆర్‌సీ16కు రెహ్మాన్‍ను తీసుకుంటే గ్లోబల్ రేంజ్‍లో బజ్ ఉంటుందని మూవీ టీమ్ భావించింది. యూనివర్సల్‍గా అప్పీల్ ఉండే పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను బుచ్చిబాబు రాసుకున్నారని మూవీ టీమ్ వెల్లడించింది.

ఆర్‌సీ16 సినిమా షూటింగ్ ఈ ఏడాది మార్చి లేకపోతే ఏప్రిల్‍లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నారు రామ్‍చరణ్.

గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, షూటింగ్ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పటికే 2023లో చెర్రీ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. దీంతో గేమ్ ఛేంజర్ ఎప్పుడు వస్తుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే, ఈ ఏడాది (2024) సెప్టెంబర్‌లోనే గేమ్ ఛేంజర్ వస్తుందని నిర్మాత దిల్‍రాజు ఇటీవలే చెప్పారు.

గేమ్ ఛేంజర్ మూవీలో రామ్‍చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్ కూడా కీలకపాత్రలు చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా గేమ్ ఛేంజర్ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం