తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ante Sundaraniki Ott Release: అంటే సుందరానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది

Ante Sundaraniki OTT Release: అంటే సుందరానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది

HT Telugu Desk HT Telugu

22 June 2022, 15:48 IST

google News
    • నాని అంటే సుందరానికి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూన్‌ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఆశించినంత మేర సక్సెస్‌ కాలేకపోయింది.
అంటే సుందరానికి మూవీ
అంటే సుందరానికి మూవీ (Twitter)

అంటే సుందరానికి మూవీ

నేచురల్‌ స్టార్‌ నాని చాలా రోజుల తర్వాత తన మార్క్‌ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేవలం కడుపుబ్బా నవ్వించడమే టార్గెట్‌గా అంటే సుందరానికి అంటూ ఓ వెరైటీ టైటిల్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తొలి రోజు ఈ సినిమాకు పాజిటివ్‌ టాకే వచ్చింది. అయితే ఆ తర్వాత మెల్లగా బాక్సాఫీస్‌ దగ్గర ఢీలా పడుతూ వచ్చింది.

రిలీజ్‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల వరకూ బిజినెస్‌ చేసిన అంటే సుందరానికి బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం దానికి చాలా దూరంలోనే ఉంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైంది. ఈ 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.36.45 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చాయి. ఇందులో షేర్‌ రూ.20.57 కోట్లు మాత్రమే. అంటే ఈ మూవీ ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌కు రూ.10 కోట్ల దూరంలో ఉంది.

12వ రోజు కేవలం రూ.16 లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఆ లెక్కన ఈ సినిమా హిట్‌ కేటగిరీలో చేరడం కష్టమే. దీంతో ఈ మూవీని త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. జులై 8న అంటే సుందరానికి మూవీని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిన నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయించింది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ రొమాంటిక్‌ కామెడీని వివేక్‌ ఆత్రేయ డైరెక్ట్‌ చేయగా.. వివేక్‌ సాగర్‌ మ్యూజిక్‌ అందించాడు. ఇందులో నాని సరసన నజ్రియా నటించింది. సినిమా ప్రమోషన్‌ కూడా బాగానే చేశారు. కానీ కలెక్షన్ల పరంగా ఆశించిన మేర రాబట్టలేకపోయింది. ప్రస్తతుం బ్రేక్‌లో ఉన్న నాని.. త్వరలోనే తన నెక్ట్స్‌ మూవీ దసరా షూటింగ్‌ ప్రారంభించనున్నాడు.

తదుపరి వ్యాసం