Annapoorani OTT Release Date: నయనతార అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ -తెలుగులోనూ స్ట్రీమింగ్
15 December 2023, 6:20 IST
Annapoorani OTT Release Date: నయనతార అన్నపూర్ణి మూవీ థియేటర్‌లో విడుదలై నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలో కి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
నయనతార
Annapoorani OTT Release Date: నయనతార హీరోయిన్‌గా నటించిన 75వ మూవీ అన్నపూర్ణి డిసెంబర్ 1న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలని కలలు కనే ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించాడు.
జవాన్ సక్సెస్ తర్వాత నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పేలవమైన కథ, కథనాలకు తోడు చెన్నై వరదల ప్రభావం అన్నపూర్ణి కలెక్షన్స్‌పై బలంగా పడింది. డిజాస్టర్‌గా అన్నపూర్ణి నిలిచింది.
నెల గ్యాప్‌లోనే…
థియేటర్లలో రిలీజైన నెల రోజుల గ్యాప్‌లోనే అన్నపూర్ణి సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. థియేటర్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 దక్కించుకున్నట్లు తెలిసింది. డిసెంబర్ 29న అన్నపూర్ణి మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, కన్నడ, మలయాళ భాషల్లో అన్నపూర్ణి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అన్నపూర్ణి ఓటీటీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలిసింది. అన్నపూర్ణి సినిమాలో సత్యరాజ్, జై కీలక పాత్రలు పోషించారు.
అన్నపూర్ణి కథ ఇదే...
అన్నపూర్ణి (నయనతార) ఓ పూజారి కూతురు. తండ్రి ద్వారా చిన్నతనం నుంచి వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది. చెఫ్ కావాలని కలలుకంటుంది. కానీ ఆమె కలకు తల్లిదండ్రులు అడ్డుచెబుతారు. వారికి తెలియకుండా స్నేహితుడు ఫర్హాన్(జై) చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి.
ఆ తర్వాత ఆనంద్ సుందర్‌రాజన్ (సత్యరాజ్ఇం) సహాయంతో ఇండియన్ బెస్ట్ చెఫ్ కాంపిటీషన్‌లో అన్నపూర్ణి ఎలా విజేతగా నిలిచింది? ఓ ప్రమాదంలో రుచిని తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి ఎలా కోల్పోయింది అన్నదే ఈ సినిమా కథ.