Anasuya Kollywood Debut: అనసూయ కోలీవుడ్ ఎంట్రీ కల తీరనుంది
19 January 2023, 8:43 IST
Anasuya Kollywood Debut: నటిగా త్వరలోనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది అనసూయ. ప్రభుదేవాతో ఓ తమిళ సినిమా చేస్తోంది. సైంటిఫిక్ హారర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే..
అనసూయ
Anasuya Kollywood Debut: తెలుగులో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ నటిగా వైవిధ్యతను చాటుకుంటోన్న అనసూయ తాజాగా తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ప్రభుదేవా సినిమాతో తొలిసారి కోలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. సైంటిఫిక్ హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు వూల్ఫ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. వూల్ఫ్ సినిమాలో తాను ఓ కీలక పాత్ర చేయనున్నట్లు అనసూయ ట్విటర్ ద్వారా తెలిపింది. ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అనసూయతో పాటుగా లక్ష్మిరాయ్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో వూల్ఫ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
తమిళంలో రిలీజ్ అవుతోన్న అనసూయ తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. గతంలో కొన్ని తమిళ సినిమాలు అంగీకరించిన అనివార్య కారణాల వల్ల అవి విడుదలకాలేదు. ఈ సినిమాతోనే ప్రాపర్‌గా అనసూయ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న 60వ సినిమా ఇది. వూల్ఫ్ సినిమాకు విను వెంకటేష్ దర్వకత్వం వహిస్తున్నాడు. తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం తెలుగులో పుష్ఫ- 2లో అనసూయ నటిస్తోంది.
పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఈ సీక్వెల్‌లో దాక్షాయణి అనే పాత్ర చేస్తోంది. పుష్ఫరాజ్‌పై రివేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నించే మహిళగా నెగెటివ్ రోల్‌లో ఆమె పాత్ర సాగనుంది. పుష్ప - 2తో పాటు కృష్ణవంశీ రంగమార్తండ, సందీప్‌కిషన్ మైఖేల్ సినిమాల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తోంది