తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya Role In Ari Movie: ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో అన‌సూయ

Anasuya Role in Ari Movie: ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో అన‌సూయ

10 October 2022, 14:31 IST

google News
  • Anasuya Role in Ari Movie: ఎయిర్ హోస్టెస్‌గా కొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది అన‌సూయ‌. యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమా ఏదంటే...

అన‌సూయ‌
అన‌సూయ‌ (Instagram)

అన‌సూయ‌

Anasuya Role in Ari Movie: గ‌త ఏడాది విడుద‌లైన పుష్ప సినిమాలో దాక్షాయ‌ణిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించింది అన‌సూయ‌. పాత్ర‌ల ప‌రంగా వైవిధ్య‌త‌కు ప్రాధాన్య‌త‌నిచ్చే అన‌సూయ మ‌రో డిఫ‌రెంట్ రోల్ చేయ‌బోతున్న‌ది. అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో అరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమాలో అన‌సూయ ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

అరిష‌డ్వ‌ర్గాలోని కామ‌, క్రోధ‌, లోభ‌, మొహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల చుట్టూ తిరిగే క‌థ ఇద‌ని, ఆరుగురు శ‌త్రువుల‌తో ఓ ఎయిర్ హోస్టెస్ ఎలాంటి పోరాటాన్ని సాగించింద‌నే పాయింట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇందులో అన‌సూయ ఇంటెన్స్‌రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. అందంగా క‌నిపిస్తూనే ప‌వ‌ర్‌ఫుల్‌గా ఆమె క్యారెక్ట‌ర్‌ ఉంటుంద‌ని అంటున్నారు.

త్వ‌ర‌లోనే అన‌సూయ లుక్‌ను విడుద‌ల‌చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు పేప‌ర్‌బాయ్ ఫేమ్ జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సాయికుమార్‌, శ్రీకాంత్ అయ్యంగార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈసినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుతున్నారు.

ఈ సినిమాతో పాటుగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రంగ‌మార్తండ సినిమాలో అన‌సూయ‌కీల‌క పాత్ర పోషించింది. త్వ‌ర‌లోనే రంగ‌మార్తండ కూడా రిలీజ్ కానుంది.

తదుపరి వ్యాసం