తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya | చంద్రకళగా అనసూయ.. 'ఖిలాడి'లో లుక్ ఇదే

Anasuya | చంద్రకళగా అనసూయ.. 'ఖిలాడి'లో లుక్ ఇదే

HT Telugu Desk HT Telugu

04 February 2022, 19:06 IST

google News
    • Anasuya Bharadwaj movies | పుష్పతో అలరించిన అనసూయ.. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన లుక్​ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది.
ఖిలాడిలో అనసూయ లుక్​ ఇదే
ఖిలాడిలో అనసూయ లుక్​ ఇదే (twitter)

ఖిలాడిలో అనసూయ లుక్​ ఇదే

బుల్లితెర‌పై యాంక‌ర్​గా అల‌రిస్తూనే.. మ‌రోవైపు సినిమాల్లోనూ డిఫ‌రెంట్ పాత్ర‌లు చేస్తోంది అన‌సూయ‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల విడుద‌లైన ‘పుష్ప’ సినిమాలో దాక్షాయ‌ణిగా.. నెగెటివ్ షేడ్స్​తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు.. ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ‘ఖిలాడి’లో అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌ను చేస్తోంది. సినిమాకు సంబంధించి.. ఆమె లుక్‌ను శుక్ర‌వారం నిర్మాణ సంస్థ విడుద‌ల‌చేసింది. చంద్ర‌క‌ళ పాత్ర‌లో అన‌సూయ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట‌ర్​లో న‌లుపు రంగు చీరలో సిగ్గు ఒల‌క‌బోస్తూ అనసూయ క‌నిపించింది. బ్రాహ్మ‌ణ యువ‌తిగా నెగెటివ్‌, పాజిటివ్ షేడ్స్​లో ఆమె క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్​లో క‌నిపించనున్నారు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో.. డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుద‌ల‌కానుంది.

గ‌తంలో ర‌వితేజ, ర‌మేష్‌వ‌ర్మ క‌ల‌యిక‌లో '‘వీర'’ సినిమా రూపొందింది. దాదాపు ప‌దేళ్ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఆయ‌న సోద‌రుడు సాగ‌ర్ డైలాగ్స్ రాశారు.

అనసూయకు క్రేజీ ఆఫర్స్​!

కాగా అన‌సూయ ప్ర‌స్తుతం ‘ఆచార్య‌’, ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్​తో పాటు కృష్ణ వంశీ ‘రంగ‌మార్తాండ’ సినిమాల్లో ముఖ్య పాత్ర‌లు చేస్తోంది. మ‌మ్ముట్టి హీరోగా న‌టిస్తున్న ‘భీష్మ‌ప‌ర్వం’ సినిమాతో మ‌ల‌యాళీ చిత్ర‌సీమ‌లోకి ఈ ఏడాది అరంగేట్రం చేయ‌బోతోంది అనసూయ.

తదుపరి వ్యాసం