తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anand| కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టిన దేవరకొండ బ్రదర్.. ఈ సారి యాక్షన్ కథతో

Anand| కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టిన దేవరకొండ బ్రదర్.. ఈ సారి యాక్షన్ కథతో

HT Telugu Desk HT Telugu

08 February 2022, 9:01 IST

google News
    • ఇటీవలే పుష్పక విమానం సినిమాతో సందడి చేసిన ఈ యువ హీరో తాజాగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. గం.. గం.. గణేశా అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.
ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ (Twitter)

ఆనంద్ దేవరకొండ

విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే పుష్పక విమానం సినిమాతో సందడి చేసిన ఈ యువ హీరో తాజాగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. గం.. గం.. గణేశా అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. సోమవారం నాడు ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు.

హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సోమవారం నాడు పూజ కార్యక్రమాలు జరుపుకుంది. నిర్మాతలు, దర్శకుడు ఉదయ్‌కు స్క్రిప్టును అందజేశారు. యాక్షన్ ఫెస్టివల్ మొదలైందని సూచిస్తూ క్యాప్షన్ పెట్టడంతో ఈ సినిమా యాక్షన్ కథతో తెరకెక్కునుందని తెలుస్తోంది. అంతేకాకుండా టైటిల్స్‌లో గన్స్ డిజైన్ చేయడం చూస్తుంటే ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది.

ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు ప్రేమ కథా చిత్రాలు, క్లాస్ హీరో పాత్రలే చేశారు. తాజాగా ఈ సినిమాతో ఇప్పటి వరకు చేయని యాక్షన్ స్టోరీ చేయబోతున్నారని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంకా నటీ, నటుల వివరాలు చిత్రబృందం ప్రకటించలేదు. వీరితో పాటు ఇతర సాంకేతికత నిపుణుల వివరాలను త్వరలో వెలువరించనుంది. చేతన్ భరద్వాజన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి చిత్రాలతో ఆనంద్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

తదుపరి వ్యాసం