తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amaran Ott Release Date: అమరన్ ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నారా? ఏ ప్లాట్‌‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుందంటే?

Amaran OTT release date: అమరన్ ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నారా? ఏ ప్లాట్‌‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుందంటే?

Galeti Rajendra HT Telugu

03 December 2024, 19:14 IST

google News
  • Amaran OTT release date: లక్కీ భాస్కర్, క సినిమాలతో పోటీపడి దీపావళి విన్నర్‌గా నిలిచిన అమరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ఎప్పుడు.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్‌కి రానుందంటే? 

ఓటీటీలోకి అమరన్
ఓటీటీలోకి అమరన్

ఓటీటీలోకి అమరన్

తమిళ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. దీపావళి కానుకగా అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.300 కోట్లకి పైగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు.

ఆలస్యంగా ఓటీటీలోకి అమరన్

తమిళ్ సినిమాలు సాధారణంగా థియేటర్లలో రిలీజైన 28-30 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ..అమరన్ మూవీ మాత్రం కాస్త ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. దానికి కారణంగా..ఎవరూ ఊహించని విధంగా సినిమా వసూళ్లని రాబట్టడమే.

రెండు సినిమాలో పోటీపడి

అమరన్ రిలీజైన రోజే క, లక్కీ భాస్కర్ సినిమాలు కూడా విడుదలైనా.. ఈ రెండూ అమరన్‌ కలెక్షన్లతో పోటీపడలేకపోయాయి. లక్కీ భాస్కర్ రూ.100 కోట్ల దగ్గరే ఆగిపోగా.. క సినిమా రూ.50 కోట్ల మార్క్‌ని కూడా చేరుకోలేకపోయింది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి కూడా వచ్చేసిన విషయం తెలిసిందే.

ఫ్యాన్సీ ధర పలికిన అమరన్ ఓటీటీ హక్కులు

అమరన్ మూవీ ఓటీటీ హక్కుల్ని రూ.60 కోట్లకి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. డిసెంబరు 5న స్ట్రీమింగ్‌కి ఉంచబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వాస్తవానికి తొలుత డిసెంబరు 11న స్ట్రీమింగ్‌కి ఉంచాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. కానీ.. ఈ వారం బ్లాక్ బాస్టర్ మూవీలు ఏవీ పెద్దగా ఓటీటీ రేసులో లేకపోవడంతో వారం ముందే స్ట్రీమింగ్‌కి ఉంచబోతోంది.

మేజర్ బయోగ్రఫీ

దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ ఆధారంగా ఈ అమరన్ మూవీని రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించగా.. వరదరాజన్‌గా శివ కార్తికేయన్ నటించారు. అతని భార్య రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించింది. సీనియర్ హీరో కమల్ హాసన్.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

తదుపరి వ్యాసం