తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Surender Reddy Movie: మ‌రోసారి రేసుగుర్రం కాంబో - అల్లు అర్జున్‌తో సురేంద‌ర్‌రెడ్డి సినిమా

Allu Arjun Surender Reddy Movie: మ‌రోసారి రేసుగుర్రం కాంబో - అల్లు అర్జున్‌తో సురేంద‌ర్‌రెడ్డి సినిమా

27 December 2022, 12:22 IST

  • Allu Arjun Surender Reddy Movie: రేసుగుర్రం కాంబినేష‌న్ మ‌రోసారి వెండితెర‌పైకి రాబోతున్న‌ది. అల్లు అర్జున్ హీరోగా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్

Allu Arjun Surender Reddy Movie: అల్లు అర్జున్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రేసుగుర్రం సినిమా టాలీవుడ్‌ బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. తాజాగా ఈ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్‌తో సురేంద‌ర్‌రెడ్డి ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

అల్లు అర్జున్ కోసం ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసే ప‌నిలో సురేంద‌ర్‌రెడ్డి ఉన్న‌ట్లు చెబుతున్నారు. రేసుగుర్రం త‌ర‌హాలోనే యాక్ష‌న్‌, ఫ‌న్ మేళ‌వించి ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం అఖిల్‌తో ఏజెంట్ సినిమాను రూపొందిస్తున్నాడు సురేంద‌ర్‌రెడ్డి. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఏజెంట్ సినిమాలో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు అల్లు అర్జున్ పుష్ప -2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. టాలీవుడ్‌లో గ‌త ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప -2 తెర‌కెక్కుతోంది.

ఈ సీక్వెల్ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత అల్లు అర్జున్ - సురేంద‌ర్‌రెడ్డి సినిమా సెట్స్‌పైకి రానున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం