తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా: పుష్ప 2 మూవీపై బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ వైరల్

Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా: పుష్ప 2 మూవీపై బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ వైరల్

Hari Prasad S HT Telugu

10 December 2024, 12:10 IST

google News
    • Allu Arjun: అల్లు అర్జున్ కు మరో నేషనల్ అవార్డు ఖాయం అని అంటోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. పుష్ప 2 మూవీ చూసిన తర్వాత ఆమె ఎక్స్ అకౌంట్ ద్వారా ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా: పుష్ప 2 మూవీపై బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ వైరల్
అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా: పుష్ప 2 మూవీపై బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ వైరల్

అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా: పుష్ప 2 మూవీపై బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ వైరల్

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఓ వైపు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటే.. మరోవైపు సినిమాలో అతని నటనపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. పుష్ప పార్ట్ 1 కోసం అతడు నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలుసు కదా. ఇప్పుడీ మూవీతో మరో నేషనల్ అవార్డు ఖాయం అని అంటోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.

పుష్ప 2పై ఊర్వశి రౌతేలా రివ్యూ

పుష్ప 2 మూవీని ఈ మధ్యే థియేటర్లో చూసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. తన ఎక్స్ అకౌంట్ ద్వారా మూవీపై స్పందించింది. ఈ సందర్భంగా థియేటర్లలో తాను సినిమా చూస్తున్న కొన్ని షార్ట్ వీడియోలను పోస్ట్ చేసింది. "అల్లు అర్జున్ గారికి రెండో నేషనల్ అవార్డు రాబోతోంది.

అతని అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇది. కంగ్రాచులేషన్స్ టు పుష్ప 2 టీమ్" అనే క్యాప్షన్ తో ఊర్వశి ఈ ట్వీట్ చేసింది. రెండు లైన్లలో ఆమె ఇచ్చిన పుష్ప 2 ది రూల్ మూవీ రివ్యూ అభిమానులను బాగా ఆకర్షిస్తోంది. ఈ ట్వీట్ కు ఆమె మూవీలోని జాతర సీన్లో బన్నీ రెచ్చిపోయి డ్యాన్స్ చేసే వీడియోను కూడా యాడ్ చేసింది.

పుష్ప 2 బాక్సాఫీస్ కలెక్షన్లు

పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రిలీజైనప్పటి నుంచీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉంది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐదో రోజైన సోమవారం (డిసెంబర్ 9) వసూళ్లు ఏకంగా 55 శాతం తగ్గినా.. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సినిమాలతో పోలిస్తే ఇంత వేగంగా రూ.900 కోట్ల మార్క్ అందుకున్న తొలి మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్ కు ఎక్కువ కలెక్షన్లు వస్తుండటం విశేషం. కేవలం ఇండియాలో నెట్ వసూళ్లు చూసుకుంటే.. ఐదో రోజే రూ.600 కోట్ల మార్క్ అందుకుంది. హిందీలో రూ.331 కోట్లు, తెలుగులో రూ.211 కోట్లు వసూలు చేసింది. తమిళంలో ఆశ్చర్యకరంగా ఐదు రోజుల్లో ఏకంగా రూ.34 కోట్లు వసూలు కావడం విశేషం. ఓ తెలుగు డబ్బింగ్ సినిమా తమిళనాడులో ఈ స్థాయి వసూళ్లు సాధించడం నిజంగా విశేషమే.

ఇక నాలుగో రోజైన ఆదివారం (డిసెంబర్ 8) కేవలం హిందీ వెర్షనే రూ.85 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రికార్డు ఇది. ప్రతి రోజూ పుష్ప 2 క్రియేట్ చేస్తున్న రికార్డుల గురించి మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉంది. అత్యంత వేగంగా రూ.800 కోట్ల మార్క్ దాటిన ఇండియన్ సినిమాగా నిలిచినట్లు సోమవారం (డిసెంబర్ 9) మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.829 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చెప్పింది. మూవీ జోరు చూస్తుంటే.. మంగళ లేదా బుధవారాల్లోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

తదుపరి వ్యాసం