Allu Arjun Animal Review: యానిమల్ మూవీపై అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ చూశారా?
08 December 2023, 14:54 IST
- Allu Arjun Animal Review: యానిమల్ మూవీపై అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది. సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యానిమల్ మైండ్ బ్లోయింగ్ మూవీ అని బన్నీ స్పష్టం చేశాడు.
యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్
Allu Arjun Animal Review: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన యానిమల్ మూవీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రివ్యూ ఇచ్చాడు. సినిమా రిలీజైన వారం రోజులకు ఇవాళ అంటే శుక్రవారం (డిసెంబర్ 8) బన్నీ సోషల్ మీడియా ఎక్స్ లో యానిమల్ రివ్యూ ఇవ్వడం విశేషం. మూవీ మైండ్ బ్లోయింగ్ అంటూ ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ను పొగుడుతూ వెళ్లాడు.
యానిమల్ మూవీ ఓవైపు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుండగా.. మరోవైపు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. యానిమల్ ఓ సినిమాటిక్ బ్రిలియన్స్ అని బన్నీ ఆకాశానికెత్తాడు. రణ్‌బీర్, రష్మిక, బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, సందీప్ రెడ్డి వంగాలపై ప్రశంసలు కురిపించాడు.
యానిమల్ మూవీపై అల్లు అర్జున్ రివ్యూ ఇదీ..
"యానిమిల్.. మైండ్ బ్లోయింగ్ మూవీ. ఈ సినిమాటిక్ బ్రిలియన్స్ చూసి పిచ్చెక్కేసింది. కంగ్రాచులేషన్స్. రణ్‌బీర్ కపూర్ జీ ఇండియన్ సినిమా పర్ఫార్మెన్స్ ను మరో లెవల్ కు తీసుకెళ్లారు. చాలా ఇన్‌స్పైరింగా ఉంది. మీరు క్రియేట్ చేసిన మ్యాజిక్ చూసి నాకు మాటలు రావడం లేదు. రష్మిక నువ్వు అద్భుతం. ఇప్పటి వరకూ నీ అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇది. మరిన్ని రావాల్సి ఉంది.
బాబీ డియోల్ జీ మీ పర్ఫార్మెన్స్ అందరినీ మాటలు లేకుండా చేసింది. అనిల్ కపూర్ జీ మీ అనుభవమే మీరేంటో చెబుతోంది. యంగ్ లేడీ తృప్తి దిమ్రి గుండెలు కొల్లగొడుతోంది. మరిన్ని కొల్లగొట్టాలని అనుకుంటున్నాను. అందరు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వాళ్ల అత్యుత్తమ పర్ఫార్మెన్స్ చూపించారు. కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు.. మీరు మైండ్ బ్లోయింగ్. మీరు అన్ని సినిమాటిక్ పరిమితులను దాటేశారు.
ఇంటెన్సిటీకి అసలు ఏదీ సాటిరాదు. మీరు మా అందరినీ గర్వించేలా చేశారు. భవిష్యత్తులో మీ సినిమాలు ఇండియన్ సినిమాను ఎలా మార్చేయబోతున్నాయో అర్థమవుతూనే ఉంది. ఇండియన్ సినిమా క్లాసిక్స్ జాబితాలో యానిమల్ చేరింది" అని అల్లు అర్జున్ సుదీర్ఘమైన రివ్యూ ఇచ్చాడు.
మరోవైపు యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకెళ్తోంది. ఇప్పటికే 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లు వసూలు చేసింది. ఇండియాలోనూ రూ.300 కోట్ల కలెక్షన్లు దాటాయి. అయితే ఈ మూవీలో ఆడవాళ్లను తీవ్రంగా అవమానించారంటూ అదే స్థాయిలో విమర్శలూ వెల్లువెత్తుతుండటం గమనార్హం.