Alia Bhatt: రణ్బీర్ ప్రపోజల్ ఫొటోను షేర్ చేసిన ఆలియా.. ఓ లుక్కేయండి
28 June 2022, 12:06 IST
- ఆలియా భట్.. తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే తన ఇన్స్టాగ్రామ్ డీపీ ఛేంజ్ చేసింది. రణ్బీర్ తనకు ప్రపోజ్ చేసినప్పుడు దిగిన ఫొటోను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఆలియా-రణ్బీర్
రణ్బీర్ కపూర్-ఆలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు మంగళవారం నాడు ఆలియా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఫొటోను షేర్ చేసింది. త్వరలో బేబీ రాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, సహచరులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాసేపట్లోనే ఈ వార్త వైరల్గా మారింది. ఈ విషయం ప్రకటించిన కొన్ని గంటలకే ఆలియా తన ఇన్స్టాగ్రామ్ డీపీని ఛేంజ్ చేసింది. ఇదే తన ఫేవరెట్ పిక్చర్ అంటూ స్పష్టం చేసింది.
ఆ డీపీని ఓ సారి పరిశీలిస్తే రణ్బీర్.. ఆలియాకు ప్రపోజ్ చేసినప్పుడు దిగిన ఫొటో అని తెలుస్తుంది. వెకేషన్కు తీసుకెళ్లిన రణ్బీర్.. ఆమెకు ప్రపోజ్ చేశాడు. బాలీవుడ్ హీరో చేతిలో రింగ్ బాక్స్ ఉండటం.. ఆలియా సిగుతో కూడిన ఆనందంతో చిరునవ్వులు చిందించడం గమనించవచ్చు.
ఇదే ఫొటోను రణ్బీర్ తల్లి నీతూ కపూర్ కూడా షేర్ చేసింది. రెండు హార్ట్ ఎమోజీలకు తోడు దేవుడి ఆశీర్వాదాలు మీకుండాలంటూ ఫొటోను పంచుకుంది నీతూ కపూర్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ జంటకు నెటిజన్లు కూడా వరుస పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాను తల్లికాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సోమవారం వెల్లడించింది అలియా. భర్త రణ్బీర్తో కలిసి హాస్పిటల్ లో ఉన్న ఫొటోను పంచుకున్నది. ఇందులో బెడ్ పై అలియా భట్ పడుకొని ఉండగా ఆమె పక్కన రణ్బీర్ కూర్చొని ఉన్నాడు.ఈ ఫొటోలో తమ పక్కనే ఉన్న కంప్యూటర్ స్ర్కీన్ వైపు చూస్తూ ఇద్దరు చిందిస్తూ కనిపించారు. ఆ స్ర్కీన్ పై లవ్ సింబల్ కనిపిస్తోంది. అవర్ బేబీ కమింగ్ సూన్ అంటూ అలియా ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది.
టాపిక్