Alia Bhatt: రణ్‌బీర్, ఆలియాలకు వెరైటీగా విషెస్ చెప్పిన డ్యూరెక్స్ కండోమ్స్
27 June 2022, 19:13 IST
- Alia Bhatt: ఈ మధ్యే పెళ్లి చేసుకున్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ అందుకోనున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఆలియా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
రణ్‌బీర్, ఆలియా
పెళ్లి చేసుకున్నాక తీపి కబురు అందించే జంటలకు ఒక్కొక్కరు ఒక్కోలా విషెస్ చెబుతుంటారు. అలాగే ఇప్పుడు రణ్‌బీర్, ఆలియా భట్ జంటకు కూడా కండోమ్స్ తయారు చేసే కంపెనీ అయిన డ్యూరెక్స్ తనదైన స్టైల్లో శుభాకాంక్షలు చెప్పింది. డ్యూరెక్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ల ద్వారా విషెస్ తెలిపింది. ఇది ఆ వెంటనే వైరల్‌గా మారిపోయింది.
"మీ మధ్య మేము లేమని స్పష్టంగా తెలిసిపోయింది" అంటూ డ్యూరెక్స్ కండోమ్స్ చమత్కరించింది. ఈ ఫన్నీ పోస్ట్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి ఎంతోమంది అభిమానులు పగలబడి నవ్వుతున్నట్లుగా లాఫ్ ఎమోజీలను పోస్ట్ చేశారు. నిజానికి రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకున్న సమయంలోనూ డ్యూరెక్స్ కండోమ్స్ ఇలాంటి పోస్టే చేసింది.
"డియర్ రణ్‌బీర్, ఆలియా.. మీ మధ్య మేము లేకపోతే, ఫన్ అయితే ఉండదు" అంటూ అప్పట్లో ఈ కండోమ్స్ కంపెనీ వీళ్లను విష్ చేసింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఇలా విషెస్ చెప్పడం విశేషం. రణ్‌బీర్, ఆలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆలియా వెల్లడించింది.