తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Alia Bhatt |హాలీవుడ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్న అలియా...ఎమోషనల్ పోస్ట్ వైరల్

Alia Bhatt |హాలీవుడ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్న అలియా...ఎమోషనల్ పోస్ట్ వైరల్

HT Telugu Desk HT Telugu

21 May 2022, 6:55 IST

  • ద‌శాబ్ద‌కాలంగా ప‌లు విభిన్న‌మైన పాత్ర‌ల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తోంది అలియాభట్. తాజాగా ఆమె హాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ది. ఈ సంద‌ర్భంగా అలియాభ‌ట్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది

అలియాభట్
అలియాభట్ (instagram)

అలియాభట్

చిర‌కాల ప్రియుడు ర‌ణ్‌భీర్‌క‌పూర్‌తో ఇటీవలే ఏడ‌డుగులు వేసి కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టింది అలియాభ‌ట్‌. ఇన్నాళ్లు వైవాహిక బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించిన ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాల‌పై దృష్టిపెట్టింది. త్వరలో హాలీవుడ్ సినిమా షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

హార్ట్ ఆఫ్ స్టోన్ అనే థ్రిల్ల‌ర్ సినిమాతో అలియా హాలీవుడ్‌లో అరంగేట్రం చేయ‌బోతున్న‌ది. ఈ సినిమాలో వండ‌ర్ ఉమెన్ ఫేమ్ గాల్ గాడోట్‌తో పాటు జామీ డోర్న‌న్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. టామ్ హార్ప‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాలోఅలియాభ‌ట్ పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంద‌ని స‌మాచారం.

అలియాభట్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఈ ఏడాదితో ప‌దేళ్లు పూర్తి అయ్యాయి. ఇదే ఏడాది హాలీవుడ్‌లో అరంగేట్రం చేసే అవ‌కాశం రావ‌డంలో అలియా ఎమోష‌న‌ల్ అయ్యింది. భావోద్వేగ‌భ‌రితంగా ఓ ట్వీట్ పెట్టింది. ‘హాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం బ‌య‌లుదేరుతున్నా. న‌టిగా నా ప్ర‌యాణాన్ని కొత్త‌గా మొద‌లుపెట్టిన అనుభూతి క‌లుగుతోంది. చాలా నెర్వస్ గా ఉంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ ఏడాది ఆమె టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజుకు అండ‌గా నిల‌బ‌డే యువ‌తిగా సీత పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి తొలి అడుగులోనే పెద్ద స‌క్సెస్‌ను అందుకున్న‌ది.

ప్ర‌స్తుతం భ‌ర్త ర‌ణ్‌భీర్‌క‌పూర్‌తో క‌లిసి బ్ర‌హ్మాస్త్ర సినిమాలో న‌టిస్తోంది అలియాభ‌ట్‌. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా విడుద‌ల‌కానుంది. ఫాంట‌సీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌,నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం