తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akshay Kumar Ram Setu Release Date: రామ్ సేతు రిలీజ్ డేట్ వెల్లడి – అజయ్ దేవ్‌గ‌ణ్‌తో పోటీప‌డుతున్న‌ అక్షయ్

Akshay kumar Ram Setu Release date: రామ్ సేతు రిలీజ్ డేట్ వెల్లడి – అజయ్ దేవ్‌గ‌ణ్‌తో పోటీప‌డుతున్న‌ అక్షయ్

26 September 2022, 11:52 IST

google News
  • Akshay kumar Ram Setu Release date: అక్షయ్ కుమార్ రామ్ సేతు రిలీజ్ డేట్ ను సోమవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ (twitter)

అక్షయ్ కుమార్

Akshay kumar Ram Setu Release date: ప్ర‌తి ఏడాది ఐదారు సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంటారు అక్ష‌య్‌కుమార్‌. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు అక్ష‌య్ కుమార్ న‌టించిన నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. బ‌చ్చ‌న్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్‌, ర‌క్షాభంద‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా క‌ట్‌పుట్టి మాత్రం ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తాజాగా వ‌చ్చే నెల‌లో మ‌రోసారి బాక్సాఫీస్ బ‌రిలో దిగ‌బోతున్నారు అక్ష‌య్‌కుమార్‌. అత‌డు హీరోగా న‌టిస్తున్న రామ్ సేతు రిలీజ్ డేట్‌ను సోమ‌వారం ప్ర‌క‌టించారు.

అక్టోబ‌ర్ 25న ఈ సినిమాను వ‌ర‌ల్డ్‌వైగ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. యాక్షన్ అడ్వెంచరస్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline fernandez), నుష్రాత్ బరుచా కథానాయికలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో సత్యదేవ్ (Satya Dev) రామ్ సేతు సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే అతడు బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు.

రామేశ్వరం లోని రామసేతు బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్ లో రామ్ సేతు సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో అక్షయ్ కుమార్ అర్కియాలజిస్ట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అక్షయ్ కుమార్ కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అతడు నటించిన మూడు సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.

ఈ నేపథ్యంలో రామ్ సేతు రిజల్ట్ ఎలా ఉండబోతుందన్నది బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ, ఓ మై గాడ్ 2 తో పాటు సూరారై పోట్రు రీమేక్ లో నటిస్తున్నాడు.

తదుపరి వ్యాసం