Ram Setu Trailer Release: "రామ్ సేతు" ట్రైలర్ వచ్చేసింది.. ఇతిహాసం అంటే అర్థం ఏంటో తెలుసా?
11 October 2022, 12:51 IST
- Akshay kumar Ram Setu: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం రామ్ సేతు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రం అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
![రామ్ సేతు ట్రైలర్ రామ్ సేతు ట్రైలర్](https://images.hindustantimes.com/telugu/img/2022/10/11/960x540/p_1665472798112_1665472798437_1665472798437.jpeg)
రామ్ సేతు ట్రైలర్
goRam Setu Trailer: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఏటా ఐదారు చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఇప్పటికే ఆయన నటించిన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షా బంధన్ థియేటర్లలో విడుదలవగా.. కట్ పుట్లీ మాత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మరోసినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అదే రామ్ సేతు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అక్టోబరు 25న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. శ్రీ రాముడు నిర్మించిన రామ సేతు గురించి ఈ చిత్ర కథాంశం తిరుగుతోంది. ఈ ప్రపంచంలో శ్రీరామునికి వేలాది మందిరాలు ఉన్నాయి. కానీ సేతు ఒక్కటే ఉంది అనే డేలాగ్ ఆసక్తికరంగా ఉంది. మన దేశంలో ఏడాది క్రితం వేసిన రోడ్లే గుంతలు పడుతున్నాయి.. మరి ఏడు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దానికి వెతకడం ఏంటి అనే సంభాషణ కూడా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline fernandez), నుష్రాత్ బరుచా కథానాయికలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో సత్యదేవ్ (Satya Dev) రామ్ సేతు సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే అతడు బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ అర్కియాలజిస్ట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
అక్షయ్ కుమార్ కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అతడు నటించిన మూడు సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో రామ్ సేతు రిజల్ట్ ఎలా ఉండబోతుందన్నది బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ, ఓ మై గాడ్ 2 తో పాటు సూరారై పోట్రు రీమేక్ లో నటిస్తున్నాడు.