తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mixup Ott Release: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న బోల్డ్ హీరోయిన్ తెలుగు మూవీ- స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Mixup OTT Release: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న బోల్డ్ హీరోయిన్ తెలుగు మూవీ- స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

25 January 2024, 5:53 IST

google News
  • Mixup OTT Release: బోల్డ్ హీరోయిన్ అక్ష‌ర గౌడ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ మిక్స‌ప్ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో పూజ‌జ‌వేరి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

అక్ష‌ర గౌడ‌  మిక్స‌ప్
అక్ష‌ర గౌడ‌ మిక్స‌ప్

అక్ష‌ర గౌడ‌ మిక్స‌ప్

Mixup OTT Release: సాండ‌ల్‌వుడ్ హీరోయిన్ అక్ష‌ర గౌడ‌ న‌టిస్తోన్న తెలుగు మూవీ మిక్స‌ప్ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఆహా ఓటీటీ (Aha OTT) ద్వారా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మిక్స‌ప్ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను ఆహా ఓటీటీ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది అమ్మాయి పెద‌వుల‌ను చూపిస్తూ డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

కోరిక ప్రేమ‌ను జ‌యించ‌గ‌ల‌దా అంటూ టైటిల్ కింద ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ఎరోటిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. అక్ష‌ర గౌడ‌ క్యారెక్ట‌ర్ బోల్డ్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు మించి గ్లామ‌ర‌స్‌గా ఆమె పాత్ర సాగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. న్యూ ఏజ్ మూవీగా యూత్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసే క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సినిమా తెర‌కెక్కిన‌ట్లు చెబుతోన్నారు.

పూజ జ‌వేరి కూడా...

మిక్స‌ప్ సినిమాలో అక్ష‌ర గౌడ‌తో పాటు ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్‌, క‌మ‌ల్ కామ‌రాజుతో పాటు పూజా జ‌వేరి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. మిక్స‌ప్ మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది పోస్ట‌ర్‌లో రివీల్ చేయ‌లేదు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌బోతున్నారు. ఈ నెలాఖ‌రున లేదా ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో మిక్స‌ప్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతున్నారు. తెలుగుతో పాటు త‌మిళంలో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఓటీటీ కోస‌మే ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్లు స‌మాచారం.

మ‌న్మ‌థుడు 2తో ఎంట్రీ...

నాగార్జున (Nagarjuna) మ‌న్మ‌థుడు 2 తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అక్ష‌ర గౌడ‌. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో అందాల‌ను ఆర‌బోసింది. ఆ త‌ర్వాత రామ్ పోతినేని ది వారియ‌ర్ మూవీలో ఆది పినిశెట్టి భార్య‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టించింది. విశ్వ‌క్‌సేన్ దాస్ కా ధ‌మ్కీతో పాటు రెజీనా నేనేనా సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది. ప్ర‌స్తుతం తెలుగులో సుధీర్‌బాబు హీరోగా న‌టిస్తోన్న హ‌రోంహ‌రలో అక్ష‌ర గౌడ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీటితో పాటు తెలుగులో మ‌స్తీ అనే వెబ్‌సిరీస్‌లో అక్ష‌ర గౌడ న‌టించింది.

తుపాకి, ఆరంభం...

త‌మిళంలో విజ‌య్‌తో తుపాకి, అజిత్‌తో ఆరంభం సినిమాలు అక్ష‌ర గౌడ‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ప‌ద‌మూడేళ్లు అయినా ద‌క్షిణాది భాష‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కు ప‌దిహేను వ‌ర‌కు మాత్ర‌మే సినిమాలు చేసింది. హీరోయిన్‌గా కంటే ఐటెంసాంగ్స్‌, గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపించింది. స‌రైన అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవ‌డంతో డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయిన‌ట్లు అప్ప‌ట్లో ఇంట‌ర్వ్యూల‌లో చెప్పింది అక్ష‌ర గౌడ‌. మ‌రోవైపు పూజా జ‌వేరి కూడా తెలుగులో ద్వార‌క‌, బంగారు బుల్లోడు, 47 డేస్‌తో పాటు కొన్ని సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో నాలుగైదు సినిమాలు చేస్తోంది.

తదుపరి వ్యాసం