తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akhil Akkineni Agent Movie: అఖిల్ ఏజెంట్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే

Akhil Akkineni Agent Movie: అఖిల్ ఏజెంట్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే

HT Telugu Desk HT Telugu

18 December 2022, 9:23 IST

  • Akhil Akkineni Agent Movie: అఖిల్ హీరోగా న‌టిస్తోన్న ఏజెంట్ సినిమా రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

అఖిల్
అఖిల్

అఖిల్

Akhil Akkineni Agent Movie: అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా గ‌త రెండేళ్లుగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ షూటింగ్ కంప్లీట్ కాక‌పోవ‌డంతో వాయిదాప‌డింది.

ట్రెండింగ్ వార్తలు

NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!

Tollywood: నాగ‌చైత‌న్య మూవీతో తెలుగులో హీరోయిన్‌గా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కెరీర్ ప్రారంభం కావాల్సింది...కానీ

Aavesham OTT Release Date: ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్.. రూ.150 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Parthu Telugu OTT: ఓటీటీలోకి బిగ్‌బాస్ బ్యూటీ సైకో కిల్ల‌ర్ మూవీ - ట్విస్ట్‌ల‌కు మైండ్ బ్లాక్ కావాల్సిందే!

మెయిన్ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో పాటు మ‌రో రెండు పాట‌లు బ్యాలెన్స్‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ షూటింగ్ కోసం జ‌న‌వ‌రిలో చిత్ర యూనిట్ విదేశాల‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది. ఏజెంట్ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్న‌ట్లు చెబుతున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ త‌ర్వాత అఖిల్ హీరోగా న‌టిస్తోన్న సినిమా ఇది. ఏజెంట్ సినిమాలో ఎయిట్ ప్యాక్‌లో అఖిల్ క‌నిపించ‌బోతున్నాడు. ఏజెంట్ క్యారెక్ట‌ర్ కోసం ఫిజిక‌ల్‌గా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయ‌న్‌గా న‌టిస్తోంది.

నిర్మాత అనిల్ సుంక‌ర‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే సురేంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా అరంగేట్రం చేయ‌బోతున్నారు. చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.