తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott Movie: ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న మరో తెలుగు మూవీ.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో..

Aha OTT Movie: ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న మరో తెలుగు మూవీ.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో..

Hari Prasad S HT Telugu

23 December 2024, 16:11 IST

google News
    • Aha OTT Movie: ఆహా వీడియో ఓటీటీలోకి మరో మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఈ సినిమా టైటిల్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. ఈ మూవీ విషయాన్ని సదరు ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా సోమవారం (డిసెంబర్ 23) వెల్లడించింది.
ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న మరో తెలుగు మూవీ.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో..
ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న మరో తెలుగు మూవీ.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో..

ఆహా వీడియో ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న మరో తెలుగు మూవీ.. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో..

Aha OTT Movie: ఓటీటీలోకి ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఇప్పుడు మరో మూవీ ఆహా వీడియోలోకి వస్తోంది. ఈ సినిమా పేరు కథా కమామీషు. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని సోమవారం (డిసెంబర్ 23) ఆహా వీడియో ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెప్పింది తప్ప స్ట్రీమింగ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.

కథా కమామీషు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్

కథా కమామీషు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఓ తెలుగు సినిమా వస్తోంది. "లైఫ్ లో ఉండాలి జోషు.. త్వరలో మీకోసం కథా కమామీషు" అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సినిమా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో మూవీలోని లీడ్ రోల్స్ సరదాగా ఆడుతూ కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఓ రూరల్ డ్రామాలాగా అనిపిస్తోంది.

ఊళ్లలో ఉండే ఇళ్ల వాతావరణం ఇందులో చూడొచ్చు. ఈ మధ్యే వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీని డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ ఈ కథా కమామీషుకు కథ అందించడం విశేషం. ఇక కార్తికేయన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మోయిన్, కృష్ణతేజలాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ కథా కమామీషు మూవీ స్ట్రీమింగ్ తేదీని ఆహా వీడియో త్వరలోనే అనౌన్స్ చేయనుంది.

ఆహా వీడియో మూవీస్

ఆహా వీడియో ఓటీటీలోకి ఈ మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి జీబ్రా. సత్యదేవ్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గత శుక్రవారం (డిసెంబర్ 20) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు సోనియా అగర్వాల్ నటించిన 7/జీ ది డార్క్ స్టోరీ అనే మరో హారర్ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక నీలి మేఘ శ్యామ అనే మరో మూవీ కూడా త్వరలోనే రానున్నట్లు ఆహా వీడియో ఈ మధ్యే అనౌన్స్ చేసింది.

ఇవి కాకుండా వేరే లెవెల్ ఆఫీస్ అనే కొత్త వెబ్ సిరీస్ కూడా ప్రారంభమైంది. ప్రతి గురు, శుక్రవారాల్లో కొత్త ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అటు సూపర్ హిట్ సెలబ్రిటీ టాక్ సో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేలో ఈవారం వెంకటేష్ వస్తున్నాడు. ఈ ఇద్దరూ వచ్చే సంక్రాంతికి పోటీ పడుతున్న విషయం తెలిసింది. బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.

తదుపరి వ్యాసం