తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Ott Platform: అఖిల్ ఏజెంట్ వచ్చేది ఆ ఓటీటీలోకే..

Agent OTT Platform: అఖిల్ ఏజెంట్ వచ్చేది ఆ ఓటీటీలోకే..

Hari Prasad S HT Telugu

21 February 2023, 17:39 IST

google News
    • Agent OTT Platform: అఖిల్ ఏజెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారైంది. ఈ మూవీ ప్రమోషన్లు త్వరలోనే ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్ ఏజెంట్ మూవీ
అఖిల్ ఏజెంట్ మూవీ

అఖిల్ ఏజెంట్ మూవీ

Agent OTT Platform: అఖిల్ అక్కినేని నటిస్తున్న మూవీ ఏజెంట్. ఈ మూవీ కోసం అఖిల్ మేకోవర్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీలో అఖిల్ ఇప్పటి వరకూ కనిపించనంత స్లైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.

ఇక తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఖరారైంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ స్పై థ్రిల్లర్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఏజెంట్ మూవీలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా ఏజెంట్ నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న పాన్ ఇండియా మూవీగా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో ఏజెంట్ రిలీజ్ కాబోతోంది.

ఏజెంట్ చిత్రాన్ని తొలుత సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏప్రిల్ 28న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సైరా లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం