తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Ott Show: ఓటీటీలో మ‌రో కొత్త షో ప్లాన్ చేస్తోన్న బాల‌కృష్ణ - ఈ సారి ర‌చ్చ ర‌చ్చే

Balakrishna OTT Show: ఓటీటీలో మ‌రో కొత్త షో ప్లాన్ చేస్తోన్న బాల‌కృష్ణ - ఈ సారి ర‌చ్చ ర‌చ్చే

HT Telugu Desk HT Telugu

17 August 2023, 5:57 IST

google News
  • Balakrishna OTT Show: అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో హోస్ట్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు బాల‌కృష్ణ‌. అన్‌స్టాప‌బుల్ త‌ర్వాత ఓటీటీలో బాల‌కృష్ణ మ‌రో షో చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ షో షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌య్యే అవ‌కాశం ఉందంటే...

 బాల‌కృష్ణ
బాల‌కృష్ణ

బాల‌కృష్ణ

Balakrishna OTT Show: అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు బాల‌కృష్ణ‌. ఈ టాక్ షో ఆరంభంలో ఎన్నో విమ‌ర్శ‌లొచ్చాయి. హోస్ట్‌గా బాల‌కృష్ణ స‌క్సెస్ కాలేడ‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ అంద‌రి అంచ‌నాల్ని తారుమారు చేస్తూ అన్‌స్టాప‌బుల్ ను బిగ్గెస్ట్ స‌క్సెస్‌గా నిలబెట్టాడు బాల‌కృష్ణ‌.

టాప్ రేటెడ్ తెలుగు టాక్ షోల‌లో ఒక‌టిగా అన్‌స్టాప‌బుల్‌ నిలిచింది. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ వ‌న్‌తో పాటు సీజ‌న్ 2లో హోస్ట్‌గా త‌న‌దైన శైలి పంచ్‌లు, ప్రాస‌లు, కామెడీ టైమింగ్‌తో బాల‌కృష్ణ ఆక‌ట్టుకున్నాడు. సెల‌బ్రిటీల‌ను ఆయ‌న ప్ర‌శ్న‌లు అడిగిన తీరుపై ప్ర‌శంస‌లు కురిశాయి.

అన్‌స్టాప‌బుల్ స‌క్సెస్ నేప‌థ్యంలో ఓటీటీలో బాల‌కృష్ణ మ‌రో కొత్త‌ షో ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో వ‌చ్చిన రియాలిటీ షోల‌కు భిన్నంగా ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌మెంట్‌తో డిఫ‌రెంట్‌గా బాల‌కృష్ణ కొత్త షో ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అన్‌స్టాప‌బుల్ చేసిన ఆహా ఓటీటీ సంస్థ బాల‌కృష్ణ కొత్త షోను ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత ఈ ఓటీటీ షో కోసం బాల‌కృష్ణ డేట్స్ కేటాయించిన‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ఈ షోకు సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం భ‌గ‌వంత్ కేస‌రి షూటింగ్‌తో బాల‌కృష్ణ ఫుల్ బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా శ్రీలీల కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. షైన్ స్క్రీన్ సంస్థ భ‌గ‌వంత్ కేస‌రి సినిమాను నిర్మిస్తోంది.

తదుపరి వ్యాసం