తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Scam 2003 Review: దేశంలో సంచలనం సృష్టించిన కుంభకోణం.. స్కామ్ 2003 రివ్యూ

Scam 2003 Review: దేశంలో సంచలనం సృష్టించిన కుంభకోణం.. స్కామ్ 2003 రివ్యూ

Sanjiv Kumar HT Telugu

10 September 2023, 16:11 IST

google News
  • Scam 2003: The Telgi Story Web Series Review: దేశంలో సంచలనం సృష్టించిన అతిపెద్ద స్టాంప్ పేపర్స్ కుంభకోణంపై తెరకెక్కిన వెబ్ సిరీస్ స్కామ్ 2003. సోనీ లైవ్ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న స్కామ్ 2003 వెబ్ సిరీస్ రివ్యూ విశేషాల్లోకి వెళితే..

స్కామ్ 2003 వెబ్ సిరీస్ రివ్యూ
స్కామ్ 2003 వెబ్ సిరీస్ రివ్యూ

స్కామ్ 2003 వెబ్ సిరీస్ రివ్యూ

టైటిల్: స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ

నటీనటులు: గగన్ దేవ్ రియార్, సనా అమిన్ షేక్, భారత్ జాదవ్, విషాల్ సి భరద్వాజ్, భావన బల్సావర్ తదితరులు

షో రన్నర్: హన్సల్ మెహతా

నిర్మాత: హన్సల్ మెహతా

సంగీతం: ఇషాన్ చబ్రా

దర్శకత్వం: తుషార్ హీరానందని

ఓటీటీ: సోనీ లివ్

విడుదల తేది: సెప్టెంబర్ 1, 2023

ఎపిసోడ్స్: 5

దేశంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అందులో 2003లో సంచలనం సృష్టించింది స్టాంప్ పేపర్ల కుంభకోణం. ఈ కుంభకోణం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ 'స్కామ్ 2003: ది తెల్గి స్టోరి'. ఈ సిరీస్ రూ. 30 వేల కోట్ల స్కామ్ చేసిన అబ్దుల్ కరీమ్ తెల్గి జీవితం కథ ఆధారంగా రూపొందించారు. 'సంజయ్ సింగ్ తెల్గి స్కామ్: రిపోర్టర్స్ కి డైరీ' (Sanjay Singh's Telgi Scam: Reporter's ki Diary) నవలను రిఫరెన్స్ గా తీసుకుని డైరెక్టర్ తుషార్ హీరానందని తెరకెక్కించారు. దీనికి ఇదివరకు స్కామ్ 1992 తీసిన హన్సల్ మెహతా షో రన్నర్‍గా వ్యవహరించారు. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న స్కామ్ 2003 ఎలా ఉందో రివ్యూలో (Scam 2003 Series Review) చూద్దాం.

కథ:

అబ్దుల్ కరీమ్ తెల్గి (గగన్ దేవ్ రియార్)ది కర్ణాటకలోని ఖానాపూర్. డిగ్రీ చదివిన అతనికి సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో రైలులో పండ్లు అమ్ముకుంటాడు. అబ్దుల్ పండ్లు అమ్మే విధానం చూసి ఇంప్రెస్ అయిన షౌకత్ ఖాన్ (తలత్ అజీజ్) ఉద్యోగం ఇస్తానని, ముంబైకి వచ్చేయమని తన అడ్రస్ రాసి ఇస్తాడు. అనంతరం ఇంటికెళ్లిన అబ్దుల్ తన కుటుంబ పరిస్థితి చూసి అదే రోజు రాత్రి ముంబైకి బయలుదేరుతాడు. ముంబై వెళ్లి షౌకత్ ఖాన్‍ను కలుస్తాడు. అబ్దుల్‍కు నష్టాల్లో నడుస్తున్న లాడ్జ్ బాధ్యతలు అప్పజెబుతాడు షౌకత్. ఆ లాడ్జ్ కి తన ఐడియాలతో కస్టమర్లు వచ్చేలా చేసి లాభాలు తీసుకొస్తాడు అబ్దుల్.

ట్విస్టులు

ఈ క్రమంలోనే షౌకత్ కూతురు నఫీసా (సనా అమిన్ షేక్)తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత లాడ్జ్ ద్వారా వచ్చే లాభాలు సరిపోక డబ్బును సంపాదించడం కాదు.. సృష్టించాలనుకుంటాడు. అందుకోసం అబ్దుల్ ఎలాంటి పనులు చేశాడు? ఏయే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? సక్సెస్ అయ్యాడా? చివరికీ రూ. 30 వేల కోట్ల స్టాంప్ పేపర్స్ స్కామ్ ఎలా చేశాడు? ఎలా దొరికిపోయాడు? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఈ స్కామ్ 2003 సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజ జీవిత సంఘటనలకు సంబంధించిన సినిమాలు, సిరీసులు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తాయి. ఇక సంచలనం సృష్టించిన కుంభకోణాల గురించి వివరంగా చెప్పే కథలు మరింత క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇప్పటికే హర్షద్ మెహతా జీవిత కథతో వచ్చిన స్కామ్ 1992 సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు అదే కోవలో వచ్చిన స్కామ్ 2003 కూడా అంచనాలను అందుకోగలిగిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభంలో డైలాగ్స్ తో ఆసక్తి పెంచిన సిరీస్ తర్వాత సన్నివేశాలు, అబ్దుల్ కరీమ్ తెల్గి ఐడియాలు, ప్లాన్స్ తో ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది.

హైలెట్స్

అబ్దుల్ కరీమ్ తెల్గి అనే వ్యక్తి మనీ క్రియేట్ చేయడానికి ఎలాంటి దారులు వెతికాడు. ఎవరెవరినీ కలుసుకున్నాడు అతనికి ఎదురైన సవాళ్లు స్టాంప్ పేపర్స్ స్కామ్ చేయాలని వచ్చిన ఆలోచన, దాని అమలుపరిచిన తీరు, ఈ క్రమంలో అబ్దుల్‍కు జరిగిన అవమానాలు, నిందలు, కేసులు, జైలుకు వెళ్లడం, పోలీసులు-రాజకీయ నాయకులతో పని చేయించుకున్న తీరు ప్రతి ఒక్కటి గ్రిప్పింగ్‍గా ఆసక్తిగా తెరకెక్కించారు. సుమారు 50 నుంచి 55 నిమిషాలతో ఉన్న 5 ఎపిసోడ్స్ గల ఈ సిరీస్ కొన్ని చోట్ల బోర్ కొట్టే అవకాశం లేకపోలేదు. కానీ, తర్వాత ఏంటీ అనే క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ వచ్చారు.

క్లైమాక్స్

ఇక సిరీస్ నాలుగో ఎపిసోడ్‍లో అబ్దుల్ ఇచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేం. ఐదో ఎపిసోడ్ ఎండింగ్ వరకు తను వేల కోట్లు ఎలా సంపాదించాడో చూపించారు. స్టాంప్ పేపర్స్ క్రియేట్ చేయడంలో ఒక సామ్రజ్యాన్ని సృష్టించిన అబ్దుల్ తెల్గి తన ఇగో వల్ల చేసిన ఒక చిన్న తప్పుతో అందరి దృష్టిలో పడే సీన్‍తో సిరీస్ ఫస్ట్ పార్ట్ ముగించారు. దీని తర్వాతే అబ్దుల్ ఎలా దొరికిపోయాడో చూపించనున్నారు. అదంతా సెకండ్ పార్టులో ఉండనుంది. స్కామ్ 2003 సెకండ్ పార్ట్ నవంబర్‍లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఎవరెలా చేశారంటే?

అబ్దుల్ పాత్రలో గగన్ దేవ్ రియార్ ఒదిగిపోయాడు. అతని నటనతో ఆ పాత్రకు ఇంప్రెస్ అవుతాం. ఇక సందర్భానుసారం వచ్చే పాత్రలు సైతం పూర్తిగా ఆకట్టుకున్నాయి. ఇలాంటి స్కామర్ జీవిత కథను అర్ధవంతంగా తెరకెక్కించి డైరెక్టర్ తుషార్ హీరానందని పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇక ఇషాన్ చబ్రా బీజీఎమ్ చాలా బాగుంది. మూడ్‍కు తగినట్లుగా అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. టైటిల్స్ కు మాత్రం స్కామ్ 1992 థీమ్ వాడారు. ఓవరాల్‍గా చెప్పాలంటే డిసప్పాయింట్ చేయని గుడ్ వాచ్ లెంతీ సిరీస్ స్కామ్ 2003 (Scam 2003 Review Telugu).

రేటింగ్: 3/5

తదుపరి వ్యాసం