Eagle First Song: రవితేజ ‘ఈగల్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మాస్ జాతరే
05 December 2023, 19:29 IST
- Eagle First Song: ఈగల్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఆడు మచ్చా అంటూ ఈ సాంగ్ ఫుల్ మాస్ బీట్‍తో ఉంది. వివరాలివే..
Eagle First Song: రవితేజ ‘ఈగల్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మాస్ జాతరే
Eagle First Song: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఆడు మచ్చా అనే ఈ పాటను నేడు (డిసెంబర్ 5) విడుదల చేసింది మూవీ యూనిట్. ఫుల్ మాస్ బీట్‍తో అదిరిపోయేలా ఈ సాంగ్ ఉంది. ఈగల్ చిత్రం థియేటర్లలో 2024 జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ తొలి పాట నుంచే ప్రమోషన్ల జోరును మూవీ యూనిట్ పెంచింది. వివరాలివే..
ఈగల్ చిత్రం నుంచి తొలి పాట ఆడు మచ్చా ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రోమోతోనే ఫుల్ హైప్ రాగా.. నేడు పూర్తి పాట వచ్చింది. సినిమాలో ఓ జాతర సందర్భంగా ఈ పాట ఉండనుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సాంగ్‍కు మాస్ మహారాజ్ రవితేజ డ్యాన్స్ హైలైట్‍గా ఉంది.
ఈ పాటకు ఫుల్ జోష్ ఉన్న బీట్‍ను ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ డావ్‍జంద్. రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ పాడారు. కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించారు. జాతర సెటప్‍లో ఫుల్ మాస్ గెటప్‍లో రవితేజ వేసిన స్టెప్స్ ఈ సాంగ్‍లో ఆకట్టుకుంటున్నాయి. “తురుపు తునక.. ఎరుపు బారెనే.. ఎగులు దునికి దుంకులాడెనే” అంటూ ఈ పాట మొదలైంది. పవర్ ఫుల్ లైన్లతో ఈ సాంగ్ ఉంది. పాట మొత్తం మాస్ జాతరలా సాగింది.
ఈగల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్ అయిన కార్తీక్‍కు డైరెక్టర్‌గా ఇది రెండో మూవీ. ఈ సినిమాలో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోశ్ కీరోల్స్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్.. ఈగల్ మూవీని నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి డైరెక్షన్, ఎడిటింగ్‍తో పాటు సినిమాటోగ్రఫర్‌గానూ కార్తీక ఘట్టమనేని వ్యవహరిస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందిస్తున్నారు. జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.