36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్
28 May 2024, 13:58 IST
- 36 Days Web Series: ఓటీటీలోకి మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. 36 డేస్ పేరుతో నేహా శర్మ నటించిన ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం (మే 28) రిలీజ్ కాగా.. ఇది ఎంతో ఉత్కంఠ రేపింది.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్
36 Days Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. సోనీలివ్ ఓటీటీ ఈ జానర్ లో త్వరలోనే ఓ వెబ్ సిరీస్ తీసుకురానుంది. చిరుత మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహా శర్మ ఈ సిరీస్ లో నటించింది. తాజాగా మంగళవారం (మే 28) ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ట్రైలరే ఊహించని మిస్టరీతో థ్రిల్ ను పంచింది.
36 డేస్ వెబ్ సిరీస్
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ జానర్ సిరీస్ లు మినిమం గ్యారెంటీ థ్రిల్ పంచుతాయన్న అభిప్రాయం ఓటీటీ ప్రేక్షకుల్లో ఉంది. అందుకే వీటిపైనే ఎక్కువగా సిరీస్ లు రూపొందుతాయి. తాజాగా 36 డేస్ కూడా అలాగే రానుంది. నేహా శర్మతోపాటు పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ లాంటి వాళ్లు ఇందులో నటించారు.
ఈ ట్రైలర్ మొదట్లో ఓ అపార్ట్మెంట్ లోకి రెంట్ కు వస్తుంది నేహా శర్మ. స్విమ్ సూట్లో పూల్లోకి దిగుతుంటే.. అక్కడి మగవాళ్ల కళ్లన్నీ ఆమెపైనే ఉంటాయి. అందులో ఒకరు ఆమెతో ప్రేమలో పడతారు. అయితే ఆ తర్వాత వచ్చే ట్విస్టులే ఆసక్తి రేపుతాయి. ఆ అమ్మాయి ప్రవర్తన అంతా అంతుబట్టకుండా ఉంటుంది. అంతలోనే ఓ వృద్ధురాలు కనిపించకుండా పోవడం, ఓ హత్యతో ట్రైలర్ మరో మలుపు తీసుకుంటుంది.
ఇక అక్కడి నుంచి అన్నీ ట్విస్టులే. అసలు ఆమె ఎవరు? అక్కడికి ఎందుకు వచ్చింది? ఏం చేసింది అన్నది ఈ 36 డేస్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ (రహస్యాలు ఆరోగ్యానికి హానికరం) అనే ట్యాగ్ లైన్ తో ఈ సిరీస్ రాబోతోంది. మరి అంతలా భయపెట్టే ఆ సీక్రెట్స్ ఏంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. 100 సెకన్ల ఈ ట్రైలర్ తర్వాత త్వరలో అన్నారు తప్ప ఈ సిరీస్ రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించలేదు.
ఏడాదిగా ప్రొడక్షన్లోనే..
36 డేస్ వెబ్ సిరీస్ ఏడాదికిపైగా ప్రొడక్షన్ లోనే ఉంది. అప్లౌజ్ ఎంటర్టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ ను విశాల్ ఫ్యూరియా డైరెక్ట్ చేశాడు. అతడు ఎక్కువగా హారర్, థ్రిల్లర్ జానర్ కంటెంట్ క్రియేట్ చేస్తుంటాడన్న పేరుంది.
అతడు ఇప్పటికే ఇలాంటి జానర్ లోనే ఫోరెన్సిక్, ఛోరీ, లపాఛపీలాంటి సినిమాలు తీశాడు. ఇప్పుడు నుష్రత్ భరూచాతో ఛోరీ 2 మూవీ చేస్తున్నాడు. మరోవైపు సోనీలివ్ ఓటీటీ కోసం ఈ 36 డేస్ వెబ్ సిరీస్ తీశాడు. ఈ సిరీస్ రిలీజ్ ను త్వరలోనే ఆ ఓటీటీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నేహా శర్మనే ఈ సిరీస్ లో ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.