తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  India Box Office Collections : కలెక్షన్లలో 2019 వెనకే 2022.. ఎన్ని వేల కోట్లంటే?

India Box Office Collections : కలెక్షన్లలో 2019 వెనకే 2022.. ఎన్ని వేల కోట్లంటే?

Anand Sai HT Telugu

31 January 2023, 14:35 IST

    • Box Office Collections In India : కొవిడ్ కారణంగా 2020, 2021 అన్ని రంగాలపై ప్రభావం చూపించింది. సినిమా రంగం మీద ఇంకా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 2022లో పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. KGF 2, RRR లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేశాయి. కానీ ఇండియన్ స్క్రీన్ మీద 2019 వసూళ్లే ఎక్కువ.
కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్
కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్

కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్

2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలను గుర్తుచేసుకుంటే.. ఇండియన్ స్క్రీన్(Indian Screen) మీద ఇంత వసూళ్లు సాధించిన ఏడాది అదే అనుకుంటారు. కానీ అది కాదు. 2022 భారతదేశ బాక్సాఫీస్ కలెక్షన్స్(Box Office Collections) రికార్డు.. చరిత్రలో రెండో అత్యంత విజయవంతమైన సంవత్సరం. అంతకంటే.. ఎక్కువగా సాధించినది 2019లోనే. గ్రూప్ ఎం కంపెనీతో Ormax Media చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. 2019లోనే బాక్సాఫీసు ఎక్కువగా షేక్ అయిందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

2022లో ఇండియా ఈజ్ బ్యాక్ ఎట్ ది థియేటర్స్ అనుకున్నారు. దాని ప్రకారమే.. సినిమా(Cinema)లు వచ్చాయి. బాక్సాఫీసును షేక్ చేశాయి. ఇండియన్ స్క్రీన్ మీద వేల కోట్ల వ్యాపారం జరిగింది. కానీ నివేదిక ప్రకారం మాత్రం.. 2019లోనే అధికంగా వసూళ్లు వచ్చాయి. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, వాణిజ్య విశ్లేషకుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా Ormax వివరాలు వెల్లడించింది.

2020, 2021 థియేటర్లకు ఎవరూ సరిగా రాలేదు. కరోనా భయంతో ఇళ్లలోనే ఉన్నారు. ఇక 2022లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ.10,637 కోట్లు వసూళ్లు అయ్యాయి. అయితే 2019లో ఇది ఎక్కువగా ఉంది. ఆ ఏడాది రూ. 10,948 కోట్లతో ముందు ఉంది.

బాక్సాఫీస్ కలెక్షన్లలో హిందీ సినిమాలు 33 శాతం బిజినెస్ చేశాయి. తెలుగులో 20 శాతం, తమిళం 6 శాతంతో ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాలు (అన్ని భాషా వెర్షన్లతో సహా) బాక్సాఫీస్‌లో 12 శాతం సాధించాయి. హిందీ ఆధిపత్యం ఉన్నా.. కరోనా మహమ్మారి తర్వాత.. ముందు ఉన్న స్థాయి నుండి గణనీయంగా పడిపోయింది.

2022లో రెండు సినిమాలు భారతదేశ బాక్సాఫీస్ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. మొదటి స్థానంలో ప్రశాంత్ నీల్ KGF 2 బాక్సాఫీస్ వద్ద రూ. 970 వసూలు చేసింది. ఆ తర్వాత SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ 869 కోట్లతో ఉంది. జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ 2022లో మంచి బిజినెస్ చేసింది. మొదటి ఐదు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార కూడా ఉంది. రూ. 362 కోట్లు సాధించింది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్(PS-I) రూ. 320 కోట్లతో ఉంది.

అయితే 2022లో దక్షిణాది సినిమాలు.. 2019 వసూళ్లను అధిగమించాయని నివేదిక చెబుతోంది. తెలుగు(Telugu), కన్నడ(Kannada) వసూళ్లలో వృద్ధిని సాధించాయి. 2019తో పోల్చితే 2022లో హిందీ, హాలీవుడ్ చిత్రాలు తక్కువగానే ఉన్నాయి. KGF: చాప్టర్ 2, RRR, కాంతార, కార్తీకేయ 2 మొదలైన సౌత్ చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌ల ద్వారా హిందీ బాక్సాఫీస్ నుంచి 32 శాతం వచ్చింది.

2019 కంటే 2022 300 కోట్లు వెనుకబడి ఉంది. 2019 భారతీయ బాక్సాఫీస్ వద్ద ఉత్తమ వసూళ్లు సాధించిన సంవత్సరంగా మిగిలిపోయింది. 2019 ప్రీ-పాండమిక్ సంవత్సరంతో పోలిస్తే.., హిందీ సినిమా షేర్‌లో 11 శాతం పాయింట్లను కోల్పోయింది. తెలుగు సినిమా అత్యధికంగా లాభపడింది. 2022లో భారతదేశంలో 89.2 కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. ఈ సంఖ్య 2019లో 103 కోట్లకు పైగా ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం