తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lengthy Movies: అబ్బో.. ఇవి చాలా పెద్ద సినిమాలు..! చూడాలంటే ఒక పూట సరిపోదు

Lengthy Movies: అబ్బో.. ఇవి చాలా పెద్ద సినిమాలు..! చూడాలంటే ఒక పూట సరిపోదు

24 January 2022, 21:53 IST

google News
    • సాధారణంగా తెలుగు సినిమాల వ్యవధి ఎంత ఉంటుంది. యావరేజ్ గా రెండున్నర గంటలు ఉంటుంది. మహా అయితే రెండు గంటల 45 నిమిషాలకు అయితే మించడం చాలా అరుదు. కానీ, ఈ మధ్య కాలంలో సినిమాల నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అనుకున్న రీతిలో స్టోరీకి మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి ఇలా ఒక్కోసారి కాస్త ఎక్కువ సమయం పట్టడం మామూలే.
ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు?
ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు? (pexels)

ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు?

అనుకున్న కథను ఆద్యంతం ఆసక్తిగా మలిచి చివరి వరకు ప్రేక్షకుడిని  సీట్లో కూర్చోబెడితే ఆ దర్శకుడు విజయవంతం అయినట్లే. సినిమా నిడివి ఎంత ఉన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చెప్పాల్సిన అంశాన్ని సాగదీయకుండా ఉంటే సక్సెస్ సాధించినట్లే. ఈ క్రమంలో కొన్నిసార్లు నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది. 1970వ దశకంలో ఎన్టీఆర్ సినిమాల వ్యవధి ఎక్కువగా ఉండేది.  మూడు గంటలు, మరికొన్ని అంతకంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలకు కొదవే లేదు. 

దాన వీర సూర కర్ణ, పాతాళ భైరవి, మాయా బజార్ లాంటి సినిమాలు అప్పట్లో కాస్త నిడివి ఎక్కువున్న చిత్రాలు. ప్రస్తుతం ఆ పంథా మారింది. ముఖ్యంగా 70 వ దశకం తర్వాత చాలా వరకు సినిమాల నిడివి తగ్గింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రాల్లో నిడివి(రెండున్నర గంటలు కంటే అధికం) ఎక్కువగా ఉన్నకొన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. 

దాన వీర సూర కర్ణ..

1977లో వచ్చిన ఈ సినిమా మొత్తం 3గంటల 33 నిమిషాలు ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో అత్యధిక నిడివి ఉన్న చిత్రం బహుశా ఇదే కావచ్చు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను అప్పట్లో 11 లక్షల రూపాయలతో తెరకెక్కించగా.. దాదాపు రూ.2కోట్లు వసూలు చేసింది.

లవ కుశ..

1963లో వచ్చిన ఈ సినిమా నిడివి 3గంటల 28 నిమిషాలు. ఇది కూడా ఎన్టీఆర్ దే కావడం గమనార్హం. .

పాండవ వనవాసం: 

ఈ సినిమా నిడివి 3గంటల 18 నిమిషాలు. 1965లో వచ్చిన ఈ చిత్రంలోనూ  ఎన్టీఆర్ నటించారు.

పాతాళ భైరవి.. 

ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు. 1951లో వచ్చింది ఈ సినిమా.

మాయా బజార్.. 

1957లో వచ్చిన మాయాబజార్ సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు. ఈ సినిమాలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు జంటగా నటించారు.

అల్లూరి సీతారామరాజు..

కృష్ణ ప్రధాన పాత్రలో 1974లో వచ్చిన సినిమా అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా నిడివి 2 గంటల 56 నిమిషాలు.

నువ్వునాకు నచ్చావ్.. 

2001లో వేంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా నిడివి 3గంటల 4 నిమిషాలు.

మిస్సమ్మ.. 

2 గంటల 45 నిమిషాల నిడివి గల ఈ సినిమాలోనూ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు జంటగా నటించారు. ఈ సినిమా 1955లో విడుదలైంది.

ప్రస్థానం..

 శర్వానంద్ నటించిన చిత్రం ప్రస్థానం. 2010లో వచ్చిన ఈ సినిమా నిడివి 2 గంవటల 32నిమిషాలు.

నిజం: 

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సినిమా ‘నిజం’. 2003లో విడుదలైన ఈ సినిమా నిడివి 2గంటల 30 నిమిషాలు.

అర్జున్ రెడ్డి..

2017లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా నిడివి 3 గంటల 2 రెండు నిమిషాలు.

మను.. 

2018లో వచ్చిన మను సినిమా నిడివి 3గంటలు.

RRR.. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం RRR. ఈ సినిమా నిడివి 3 గంటల 7 నిమిషాలు.

రంగస్థలం: 

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో 2018లో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా నిడివి 2 గంటల 53 నిమిషాలు.

గద్దలకొండ గణేశ్: 

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం గద్దలకొండ గణేశ్. 2019లో విడుదలైన ఈ చిత్రం నిడివి 2 గంటల 54 నిమిషాలు.

తదుపరి వ్యాసం