తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024 : లోక్​సభ ఎన్నికల తొలి దశ​లో మహిళా అభ్యర్థులు 8శాతమే.. అక్కడ 0!

Lok Sabha Elections 2024 : లోక్​సభ ఎన్నికల తొలి దశ​లో మహిళా అభ్యర్థులు 8శాతమే.. అక్కడ 0!

Sharath Chitturi HT Telugu

09 April 2024, 15:40 IST

google News
  • Women candidates in Lok Sabha elections : 2024 లోక్​సభ ఎన్నికల మొదటి దశలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

లోక్​సభ ఎన్నికల తొలి దశలో అభ్యర్థుల స్టాట్స్​..
లోక్​సభ ఎన్నికల తొలి దశలో అభ్యర్థుల స్టాట్స్​..

లోక్​సభ ఎన్నికల తొలి దశలో అభ్యర్థుల స్టాట్స్​..

Lok Sabha Elections 2024 : 2024 లోక్​సభ ఎన్నికల తొలి విడతలో 102 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న 1,625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కేవలం 134 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. అంటే.. ఇది 8శాతం మాత్రమే. లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేసే మహిళా బిల్లుకు 2023 సెప్టెంబర్​లో ఆమోదం లభించినప్పటికీ.. అది అమల్లోకి వచ్చేంతవరకు క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులు కనిపించే అవకాశం లేదని ఇది స్పష్టం చేస్తోంది.

మహిళా అభ్యర్థులు తక్కువే..!

2019 లోక్​సభ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో 9 శాతం (726) మంది మహిళలు ఉన్నారు. వీరిలో కేవలం 78 మంది మాత్రమే 17వ లోక్​సభకు ఎంపికయ్యారు.

ఇక ఇప్పుడు.. తొలి దశలో తక్కువ మంది మహిళా అభ్యర్థులు కనిపిస్తున్నారు. మహిళా అభ్యర్థులను నిలబెట్టడానికి రాజకీయ పార్టీలు తొందరపడటం లేదని భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

Women candidates in Lok Sabha Elections 2024 : 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మిజోరం, అండమాన్ నికోబార్ దీవుల్లో వరుసగా 16 శాతం మహిళా అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు, మణిపూర్, నాగాలాండ్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, త్రిపుర, జమ్ము కాశ్మీర్ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పార్టీలు ఒక్క మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు.

ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో.. అరుణాచల్ ప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక మహిళా అభ్యర్థిని మాత్రమే నిలబెట్టింది. ఇతర రాష్ట్రాల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య.. బిహార్ 3, మధ్యప్రదేశ్ 7, మహారాష్ట్ర 7, మేఘాలయ 2, పుదుచ్చేరి 3, రాజస్థాన్ 12, సిక్కిం 1, ఉత్తర ప్రదేశ్ 7, ఉత్తరాఖండ్ 4, పశ్చిమ బెంగాల్ 4.

లోక్​సభ ఎన్నికల మొదటి దశలో తమిళనాడులో అత్యధికంగా 950 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 76 మంది మహిళలు ఉన్నారని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి.

ఆ అభ్యర్థులపై క్రిమినల్​ కేసులు..

Lok Sabha Elections 2024 news : ఇదిలా ఉండగా ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2024 లోక్​సభ ఎన్నికల తొలి దశలో బరిలో దిగుతున్న వారిలో 252 మంది.. తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 161 మంది 'తీవ్రమైన' క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఈ లిస్ట్​ కేవలం తొలి దశ పోలింగ్​కు సంబంధించినదే కావడం గమనార్హం. మిగిలిన 6 దశల్లో.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల సంఖ్య ఎలా ఉంటుందో చూడలి.

ఏప్రిల్​ 19తో పాటు ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

తదుపరి వ్యాసం