Lok Sabha Election 2024: ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సెలబ్రిటీలు వీరే..
- Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారతీయ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సిద్ధమవుతున్నారు. వారిలో మాజీ సినీ తారలు, టీవీ ప్రముఖలు ఉన్నారు. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం..
- Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారతీయ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సిద్ధమవుతున్నారు. వారిలో మాజీ సినీ తారలు, టీవీ ప్రముఖలు ఉన్నారు. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం..
(1 / 7)
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సెలబ్రిటీల్లో కొందరు, వారి నియోజకవర్గాలు, వారి రాజకీయ ప్రయాణం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
(2 / 7)
హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగుతున్నారు.(ANI)
(3 / 7)
ఇటీవల ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవిందా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ నుంచి బరిలోకి దిగుతున్నారు.(HT Photo/Bhushan Koyande)
(4 / 7)
షాట్ గన్ గా ప్రసిద్ధి గాంచిన బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా ఈ సారి తృణమూల్ కాంగ్రెస్ తరఫున పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో ఈ మాజీ హీరో బీజేపీలో ఉన్నారు.(ANI)
(5 / 7)
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు హేమమాలిని ఉత్తర ప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున వరుసగా మూడోసారి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.(PTI)
(6 / 7)
ప్రముఖ టీవీ సీరియల్ రామాయణ్ లో రాముడి పాత్రతో పాపులర్ అయిన అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.(X/@arungovil12)
ఇతర గ్యాలరీలు