Lok Sabha election results : కౌంటింగ్ ప్రారంభానికి ముందే తొలి సీటు గెలిచిన బీజేపీ- ఎవరంటే..
04 June 2024, 8:20 IST
Lok Sabha election results : లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కౌంటింగ్ ప్రారంభానికి ముందే.. బీజేపీకి తొలి గెలుపు లభించింది. ఇదెలా సాధ్యమైందంటే..
కౌంటింగ్ ప్రారంభానికి ముందే తొలి సీటు గెలిచిన బీజేపీ- ఎవరంటే..
Lok Sabha election results : 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ.. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. కౌంటింగ్ ప్రారంభానికి ముందే.. బీజేపీ ఒక సీటును తన ఖాతాలో వేసుకుంది. సూరత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ గెలుపొందారు. అది ఎలా సాధ్యమైందంటే..
బీజేపీ ఖాతాలో ఇప్పటికే ఒక సీటు..
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానానికి.. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ వేశారు. కానీ నీలేష్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికలకు ముందు ఇతర అభ్యర్థుల సంతకాల్లో అవకతవకలు జరిగాయని ఈసీ తెలిపింది. ఫలితంగా ముకేశ్ మినహా అందరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా.. ముకేశ్ దలాల్ రూపంలో బీజేపీకి తొలి విజయం దక్కింది.
ఫలితంగా.. 543 సీట్లకు కాకుండా.. 542 సీట్లకు నేడు కౌంటింగ్ జరుగుతోంది.
Lok Sabha election results BJP : అయితే.. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు ఒత్తిడితో నామినేషన్లను ఉపసంహరించుకున్నప్పుడు మాత్రమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో ఒక వ్యక్తిని విజేతగా ప్రకటించకూడదనే నిబంధన చట్టప్రకారం ఉండకపోవచ్చని ఆయన సూచించారు. లోక్సభ, అసెంబ్లీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు 'పైవేవీ ఉండవు' అనే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
ఓట్ల లెక్కింపు..
లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2024 Lok Sabha election results : ఏపీ, ఒడిశాతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు ఆదివారమే వెలువడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ గెలిచింది. సిక్కింలో అధికార ఎస్కేఎం సునామీ ముందు విపక్షాలేవీ నిలవలేకపోయాయి.