Lok Sabha elections : ఓటింగ్‌లో భారత్ ప్రపంచ రికార్డు.. మహిళా ఓటర్లను ఆకాశానికి ఎత్తిన ఈసీ!
Lok Sabha elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని అన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. మహిళా ఓటర్లను మెచ్చుకున్నారు.
Lok Sabha elections 2024 : లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు.. ప్రెస్ మీట్ నిర్వహించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఓటింగ్‌లో భారత దేశ ప్రపంచ రికార్డును సృష్టించిందని ప్రకటించారు. 7 విడతల్లో జరిగిన పోలింగ్ ప్రక్రియలో మొత్తం మీద 642 మిలియన్ మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియలో 312 మిలియన్ మంది మహిళలు పాల్గొన్నారని, ఇది కూడా ఒక గొప్ప రికార్డ్ అని స్పష్టం చేశారు.
“642 మిలియన్ ఓటర్లతో మనం వరల్డ్ రికార్డు సృష్టించాము. జీ7 దేశాల్లోని ఓటర్లతో పోల్చితే ఇది 1.5 రెట్లు ఎక్కువ. మొత్తం ఈయూలోని 27 దేశాలతో పోల్చుకుంటే.. 2.5 రెట్లు అధిక ఓటర్లు మన దగ్గర ఉన్నారు,” అని సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో.. భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలకు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో 1.5 కోట్ల సిబ్బంది- భద్రతా దళాలను మోహరించినట్టు, 68వేల మానిటరింగ్ టీమ్స్‌ని సైతం రంగంలోకి దింపినట్టు వివరించారు రాజీవ్ కుమార్.
Lok Sabha election counting live updates : 'మేము ఇక్కడే ఉన్నాము. ఎప్పుడూ అదృశ్యం అవ్వలేదు' అని సోషల్ మీడియాలో వైరల్ అయిన 'లాపతా జెంటిల్మెన్ (అదృశ్యమైన ఈసీ అధికారులు)'పై కామెంట్ చేశారు రాజీవ్ కుమార్.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం 4లక్షల వాహనాలు, 135 స్పెషల్ ట్రైన్లు, 1692 విమాన సదుపాయాలను ఉపయోగించుకున్నట్టు తెలిపారు సీఈసీ.
2019లో 540సార్లు రీ-పోలింగ్ జరగ్గా.. 2024లో అది కేవలం 39గా ఉందని వివరించారు రాజీవ్ కుమార్. జమ్ముకశ్మీర్‌లో.. 4 దశాబ్దాల్లోనే అత్యధిక ఓటింగ్ శాతం (58.58) నమోదైందని వివరించారు.
2024 Lok Sabha elections EC : ఇక ఎన్నికల నేపథ్యంలో 10వేల కోట్లు విలువ చేసే నగదు, డ్రగ్స్, మద్యాన్ని సీజ్ చేసినట్టు సీఈసీ తెలిపారు. 2019లో ఇది రూ. 3,500 కోట్లుగా ఉండేదని వివరించారు.
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధం చేసినట్టు తెలిపారు సీఈసీ రాజీవ్ కుమార్. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లోని ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారని వివరించారు.
సంబంధిత కథనం