తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Revanth Reddy : నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఖబడ్దార్ ప్రధానమంత్రి - మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

CM Revanth Reddy : నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా? ఖబడ్దార్ ప్రధానమంత్రి - మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

HT Telugu Desk HT Telugu

01 May 2024, 16:59 IST

    • CM Revanth Reddy : భయపెట్టి పెత్తనం చెలాయించాలని చూస్తే నిజాం నవాబుకు పట్టిన గతే పడుతుందని ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసులు రేవంత్ రెడ్డికి కొత్తేం కాదన్నారు.
మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)పై ఫైర్ అయ్యారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా అంటూ మండిపడ్డారు. ఇంకా ఎంతకాలం భయపెట్టించి బతుకుతారని ప్రశ్నించారు. భయపెడితే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. భయపెట్టి పెత్తనం చెలాయించాలంటే నిజాం నవాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Elections Campaign)ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన కాంగ్రెస్ జనజాతర(Congress Jana Jatara) బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ప్రజల్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ తీరు, మోదీ, అమిత్ షా వైఖరిపై మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చొద్దని మాట్లాడితే కేసు పెట్టి భయపెట్టిస్తారా? అని ప్రశ్నించారు. తాను మాట్లాడింది నచ్చితే విను..నచ్చకపోతే నా ఇష్టం అని ప్రజల్ని ఓట్లడుగు అని సూచించారు. ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో తెలుస్తుందన్నారు. గుజరాత్ ఆధిపత్యం..తెలంగాణ పౌరుషం గెలుస్తుందో చూస్తామన్నారు. అలా కాకుండా ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నట్లు తనను కేసులతో బెదిరిస్తున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు

కేసులకు రేవంత్ రెడ్డి భయపడతాడా?.. తనపై కేసులుపెట్టి జైల్ కు పంపిన కేసీఆర్ (KCR)ను బొందపెట్టాం.. అక్రమ కేసులతో వేధిస్తే కేసీఆర్ నడుము ఇరగపడి ఇంట్లో పుడకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మీకు దిల్లీలో ఈడీ, సీబీఐ ఉండవచ్చు కానీ తనకు నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. రిజర్వేషన్ లను రద్దు చేయాలని కుట్ర చేయలేదంటున్నారు.. ఆధారాలు మీడియాకు విడుదల చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో రిజర్వేషన్ రద్దు అంశాన్ని ప్రస్తావించారని స్పష్టం చేశారు. తెలంగాణకు వస్తున్న అమిత్ షా ...బీసీ జనగణను ఎందుకు అడ్డుకుంటున్నారో? బీసీ రిజర్వేషన్(BC Reservations) లను ఎందుకు పెంచడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నీవు భయపెడితే భయపడేవారు ఎవ్వరూ లేరు.. బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదన్నారు. మోదీ(Modi) తెలంగాణకు వచ్చి ఏం తెచ్చిండు అంటే గాడిద గుడ్డు అంటూ నినాదాలు చేయించారు రేవంత్ రెడ్డి.

ఆశామాషీ ఎన్నికలు కాదు

పార్లమెంట్ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 18వ పార్లమెంట్ ఎన్నికల్లో(18th Parliament Elections) గతంలో కంటే ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ లను రద్దు(Reservations Cancel) చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. మోదీ హాయాంలో దళితులు, గిరిజనులకు బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. మోదీ దేశాన్ని అదానీ, అంబానీ కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్ లను రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్(RSS) కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఆనాడు రిజర్వేషన్ లు కల్పించడంతోనే చాలామంది దళితులు గిరిజనులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారని తెలిపారు. వారి రహస్య ఏజెండా మీద తాను మాట్లాడితే దిల్లీలో కేసు(Case) పెట్టారని తెలిపారు. ఫిర్యాదుదారుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)అని చెప్పారు. తాను మాట్లాడింది తప్పు అయితే ఇక్కడి బీజేపీ నాయకులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కేసు ఎందుకు పెట్టలేదన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే జీవన్ రెడ్డి కేంద్రమంత్రి

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గెలిస్తే బీసీ జనగనణ చేసి బీసీలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నిజామాబాద్(Nizamabad) నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అవుతారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే వాడినని తెలిపారు. ఇప్పటికైనా పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పారు. జీవన్ రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని చెప్పారు...కానీ ఆయన తనకు జన్మనిచ్చిన జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుందని అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో నిజామాబాద్ నుంచి బరిలోకి దింపామని తెలిపారు.

జగిత్యాలకు మామిడి పరిశోధన కేంద్రం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల(Pulivendula)కు దీటుగా అభివృద్ది చేసిన జగిత్యాలకు రాష్ట్ర ప్రభుత్వం మామిడి పరిశోధన కేంద్రంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి(Jeevan Reddy) కోరారు. అదే విధంగా జగిత్యాలలో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ది అంటే సిరిసిల్ల సిద్దిపేటే కాదు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పులివెందులకు ధీటుగా జగిత్యాలను(Jagtial) అభివృద్ది చేశానని చెప్పారు.

HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGR

తదుపరి వ్యాసం