Nizamabad : రసాభాస మధ్య నిజామాబాద్ మున్సిపల్ బడ్జెట్ ఆమోదం
Nizamabad Municipal Corporation:రసాభాస మధ్య నిజామాబాద్ మున్సిపల్ బడ్జెట్ ఆమోదముద్ర పడింది. మీడియాను బయటకు పంపి సమావేశం నిర్వహించటంపై బీజేపీ బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Nizamabad Municipal Corporation Budget : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రసాభాస మధ్య ఆమోదం పొందింది. 2024-25సంవత్సరానికి సుమారు రూ.274 కోట్ల అంచనాతో బడ్జెట్ ఆమోదించారు. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందు రసాభాస నెలకొంది. బడ్జెట్ సమావేశానికి మీడియాను అనుమతించపోవడంపై బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ముందు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ ఎంసీతో సహా అన్ని మున్సిపాల్టీల్లో మీడియాను అనుమతించి.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలో నెలకొన్న సమస్యలపై మీడియా సమక్షంలోనే చర్చ జరగాలని పట్టుబట్టారు. పైగా రాష్ట్రంలో సర్కారు మారినందును ఈ ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ.. విపక్ష సభ్యుల ఆందోళన నడుమ మీడియాను పోలీసులతో బయటకు పంపారు.

మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మేయర్...
నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో మేయర్ దండు నీతుకిరణ్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నగర ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, నగర మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ మరియు కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. 2024-25సంవత్సరానికి సుమారు 274 కోట్ల అంచనా బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లు సమావేశనంతరం ఓ ప్రకటనలో తెలిపార.
ఈ బడ్జెట్ లో మున్సిపల్ ఆదాయం సుమారు రూ.90 కోట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రూ.177 కోట్ల నిధులు గ్రాంట్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని అన్నారు. మున్సిపల్ ఆదాయం నుండి మౌలిక సదుపాయాల నిర్వహణ చేస్తామని మేయర్ ప్రకటించారు. సమావేశానికి ముందు కార్పొరేటర్లు సమస్యలపై చర్చించాలని కోరగా మేయర్ అనుమతించి సభ్యుల ప్రశ్నలకు అధికారులతో వివరణ ఇచ్చారని ప్రకటనలో తెలిపారు. ఏ సమస్యలను లేవనెత్తారు? ఏం సమాధానాలు చెప్పారనే విషయం నగర ప్రజలకు తెలియకుండానే ప్రకటన విడుదల చేశారు.
రిపోర్టింగ్ - భాస్కర్, నిజామాబాద్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం