తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Lok Sabha Elections : తెలంగాణ ఉపఎన్నిక, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఇదే!

TS Lok Sabha Elections : తెలంగాణ ఉపఎన్నిక, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఇదే!

16 March 2024, 16:56 IST

google News
    • TS Lok Sabha Elections : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఉపఎన్నికల, లోక్ సభ షెడ్యూల్ ను ప్రకటించింది. మే 13న పోలింగ్ జరగగా, జూన్ 4 కౌంటింగ్ చేయనున్నారు.
తెలంగాణ ఉపఎన్నిక, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణ ఉపఎన్నిక, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్

తెలంగాణ ఉపఎన్నిక, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్

TS Lok Sabha Elections : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule) విడుదలైంది. ఉపఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి(TS Byelection) ఉపఎన్నికల తో సహా 17 లోక్ సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ (TS Loksabha elections)

  • ఎన్నికల నోటిఫికేషన్- ఏప్రిల్ 18
  • నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25
  • నామినేషన్లు ఉపసంహరణ-ఏప్రిల్ 29
  • నామినేషన్ పరిశీలన -ఏప్రిల్ 26
  • ఎన్నికల పోలింగ్ తేదీ- మే 13
  • కౌంటింగ్ తేదీ- జూన్ 4.

తెలంగాణలో ఉపఎన్నిక(TS Byelection)

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ కారణంగా ఇక్కడ ఉపఎన్నిక నిర్వహణకు ఈసీఐ (ECI)షెడ్యూల్ ప్రకటించింది. నాలుగే షెడ్యూల్ లో తెలంగాణలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

  • ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18
  • నామినేషన్ కు చివరి తేదీ-ఏప్రిల్ 25
  • నామినేషన్ పరీశీలన- ఏప్రిల్ 26
  • నామినేషన్ ఉపసంహరణ-ఏప్రిల్ 29
  • పోలింగ్ తేదీ- మే 13
  • కౌంటింగ్ -జూన్ 4

తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్
తదుపరి వ్యాసం