తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mp Assembly Elections: మరో రెండు రోజుల్లో మధ్య ప్రదేశ్ లో పోలింగ్; ముగిసిన ప్రచార పర్వం

MP Assembly elections: మరో రెండు రోజుల్లో మధ్య ప్రదేశ్ లో పోలింగ్; ముగిసిన ప్రచార పర్వం

HT Telugu Desk HT Telugu

15 November 2023, 18:12 IST

google News
  • MP Assembly elections: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 17 న మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు, అనగా, నవంబర్ 15 సాయంత్రం ఐదు గంటలకి ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ముగిసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MP Assembly elections: నవంబర్ 17న ఒకే దశలో మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ బిజెపిలు పోటీ పడుతున్నాయి. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలిచి అధికారంలోకి వచ్చింది. కాని, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బిజెపి అధికారంలోకి వచ్చింది.

డిసెంబర్ 3న కౌంటింగ్

మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17 ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఐదు గంటల వరకు లైన్లో ఉన్నవారికి, ఆ తరువాత కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఈ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ మూడవ తేదీన జరుగుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. దాదాపు అదే రోజు ఫలితాలు వెలుపడతాయి.

కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బిజెపి లతో పాటు ఎస్పీ, బీఎస్పీ, సిపిఎం పార్టీలు ఉన్నాయి. కానీ ప్రధానంగా పోటీ బిజెపి కాంగ్రెస్ మధ్యనే ఉంది. మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.6 కోట్లు. వారిలో పురుషుల సంఖ్య 2.88 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.72 కోట్లు. ఈ ఎన్నికల్లో తొలిసారి 22.36 లక్షల మంది యువత ఓటు వేస్తున్నారు.

ఎందుకంత ముఖ్యం..

మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్లో మొత్తం 29 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. ఆ పార్టీ మధ్యప్రదేశ్లో అత్యధిక లోక్ సభ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఓటర్ల మూడ్ ను తెలియజేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ ల నుంచి కీలక నేతలు బరిలో ఉన్నారు. వారిలో కాంగ్రెస్ నుంచి కమల్ నాథ్, విక్రమ్ మాస్తల్, గోవింద్ సింగ్ ఉండగా, బిజెపి నుంచి కైలాష్ విజయవర్గీయ, శివరాజ్ సింగ్ చౌహన్ నరోత్తం మిశ్రా, అంబరీష్ శర్మ తదితరులు ఉన్నారు.

తదుపరి వ్యాసం