తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Promise: ఘాజీని ముంచినట్టు వైసీపీని సముద్రంలో కలిపేయాలన్న పవన్ కళ్యాణ్.. పెందుర్తిలో ఎన్నికల ప్రచారం

Janasena Promise: ఘాజీని ముంచినట్టు వైసీపీని సముద్రంలో కలిపేయాలన్న పవన్ కళ్యాణ్.. పెందుర్తిలో ఎన్నికల ప్రచారం

Sarath chandra.B HT Telugu

02 May 2024, 6:51 IST

google News
    • Janasena Promise: పాకిస్తాన్ జలాంతర్గమి ఘాజీని సముద్రంలో ముంచేసినట్టు ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  పిలుపునిచ్చారు. పెందుర్తి జంక్షన్‌లో కూటమి అభ్యర్థుల తరపున పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
పెందుర్తి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
పెందుర్తి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్

పెందుర్తి ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్

Janasena Promise: రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఏ వ్యక్తిని కలిసినా YCP వైసీపీ నాయకులు చేసిన కబ్జాలు, ఆక్రమణల గురించి బాధితులు కథలు కథలుగా చెప్పారని, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోటా వైసీపీ నాయకుల భూ దందాలు, బెదిరింపులకు అంతే లేదని Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

పచ్చగా కళకళలాడే ఉత్తరాంధ్రను వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారని, వైసీపీ ఐదేళ్ల పాలనలో మూడు భూ కబ్జాలు, ఆరు భూ పంచాయితీల అన్న రీతిన సాగిందని చెప్పారు. భూదాహం తీరక కొత్తగా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చి ప్రజల ఆస్తుల మీద కూడా పడ్డారని తెలిపారు.

మరోసారి వైసీపీ వస్తే ప్రజలకు సొంత ఆస్తులు అనేవి ఉండకుండా చేస్తారని ఆరోపించారు. Pendurthi పెందుర్తి జంక్షన్లో జరిగిన వారాహి విజయభేరీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి లోక్ సభ అభ్యర్థి సి.ఎం.రమేష్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

జగన్ Ys jagan ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారని, ఎన్నికల ముందు వైసీపీని గెలిపిస్తే ఈ కొండలు, గుట్టలు అన్నీ ఆక్రమించేస్తారని చెప్పానని ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ప్రజలంతా కళ్లు అప్పగించి చూడడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. కొత్తగా జగన్ తీసుకువస్తున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు వస్తే ఎవరి దగ్గర సొంత ఆస్తులు, ఒరిజినల్ పత్రాలు కూడా ఉండవని అన్ని ఆస్తులు జగన్ దగ్గరే ఉంటాయన్నారు.

జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు Jobs స్థానిక యువతకే అన్నారని పరిశ్రమలు చూస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి స్కిల్ లేదు అంటాయన్నారు. యువతకు అవసరం అయిన స్కిల్స్ అందించలేదన్నారు. ఓట్లు వేయించుకుని రూ. 5 వేలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు?

రాష్ట్రంలో 23 లక్షల మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారని, దేశంలోనే రాష్ట్రం గంజాయిలో నంబర్ వన్ అయ్యింది. విశాఖ పోర్టులో 25 వేల కిలోల హెరాయిన్ దొరికింది. యువతను ఇలాంటి వ్యసనాలకు బానిస చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని సముద్రంలో తొక్కేద్దాం. పాకిస్థాన్ సబ్ మెరైన్ ఘాజీని ముంచినట్టు సముద్రలో తొక్కేద్దాంమని పిలుపునిచ్చారు.

ప్రతి కుటుంబానికి 25లక్షల ఆరోగ్యశ్రీ…

కూటమి ప్రభుత్వంలో వికలాంగులకు ప్రతి నెలా రూ. 6 వేల పింఛన్ అందిస్తామన్నారు. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి రూ. 15 వేల పింఛను, కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘ కాలిక వ్యాధుల బారినపడిన వారికి రూ. 10 వేలు అందిస్తామన్నారు. మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు.

ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత తమదని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ప్రధాన మంత్రి అండతో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు పథకాన్ని తీసుకువస్తామన్నారు. రవాణా కార్మికులకు డ్రైవర్స్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.

డ్రైవర్లను ఓనర్లను చేస్తామని, 4 లక్షలు పైబడిన వాహన కొనుగోలు రుణాలకు 5 శాతం వడ్డీ సబ్సిడీ. టాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన వారికి ఏటా రూ. 15 వేల ఆర్ధిక సాయం. జి.ఒ. 21 రద్దు చేస్తాం. గ్రీన్ టాక్స్ తగ్గిస్తామన్నారు.చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వాన్ని చెత్తకుప్పలో పడేయాలని పవన్ పిలుపునిచ్చారు.

తదుపరి వ్యాసం