తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ys Jagan In Erraguntla: సలహాలివ్వండి, వినడానికి రెడీగా ఉన్నా… ఎర్రగుంట్లలో సిఎం జగన్

YS Jagan In Erraguntla: సలహాలివ్వండి, వినడానికి రెడీగా ఉన్నా… ఎర్రగుంట్లలో సిఎం జగన్

Sarath chandra.B HT Telugu

28 March 2024, 12:02 IST

    • YS Jagan In Erraguntla: పాలనా సంస్కరణలు, వ్యవస్థల్లో జనం కోరుకునే మార్పులపై సలహాలు, సూచనలు ఇస్తే వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని సిఎం జగన్ చెప్పారు. ఆళ్లగడ్డ నియోజక వర్గంలోని ఎర్రగుంట్లలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. 
ఆళ్లగడ్డ పర్యటనలో అంబులెన్స్‌కు దారి ఇస్తున్న సిఎం జగన్
ఆళ్లగడ్డ పర్యటనలో అంబులెన్స్‌కు దారి ఇస్తున్న సిఎం జగన్

ఆళ్లగడ్డ పర్యటనలో అంబులెన్స్‌కు దారి ఇస్తున్న సిఎం జగన్

YS Jagan In Erraguntla: అధికారంలోకి వచ్చిన 58నెలల్లోనే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు అమలు చేసినట్టు సిఎం జగన్ Ys Jagan చెప్పారు. ఎన్నికల Election Campaign ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డలో పర్యటిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని వివరించారు. పాలనలో ఏమి కోరుకుంటున్నారో ప్రజలు సలహాలిస్తే స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!

తాను వయసులోను, అనుభవంలోను చిన్నవాడినేనని, ప్రజలకు తనకు చేతనైన మేలు చేస్తున్నట్టు చెప్పారు. తనకంటే అనుభవం ఉన్నవారు, వయసులో పెద్ద వారు ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పాలని సవాలు చేశారు.

త్వరలో జరిగేవి ప్రజల తలరాతలు మార్చే ఎన్నికలని, వ్యవస్థల్లో మార్పుల కోసం సలహాలు ఇవ్వాలని ప్రజలను సిఎం జగన్ కోరారు. ప్రజలు ఇచ్చే సూచనలు, సలహాల ఆధారంగా సంస్కరణలు చేపడతానని చెప్పారు.

రాష్ట్రంలో 58నెలల్లో 130సార్లు బటన్‌ నొక్కి నేరుగా DBT Schemes ద్వారా సంక్షేమాన్ని అందించినట్టు గుర్తు చేశారు. జనాభాలో 87శాతం ప్రజలకు సంక్షేమం అందిందని, ప్రతి ఊరిలో ప్రతి పేదవాడికి మేలు చేయడమే లక్ష్యంగా పథకాలను అమలు చేశామని చెప్పారు.

ఇటీవల విడుదల చేసిన ఈబీసీ నేస్తం EBC nestham, చేయూత Cheyutha పథకాలకు ముందే బటన్లు నొక్కానని డబ్బులు రాలేదని కంగారు పడొద్దన్నారు. నిధులు విడుదల చేసిన ప్రతిసారి రెండు మూడు రోజులు, వారంలోపు ఖాతాల్లో జమ అయ్యేవని, చేయూత, ఈబీసీ నేస్తం పథకం నిధులకు కాస్త ఆలస్యం అవుతుందన్నారు.

ఎన్నికల కోడ్ రాక ముందే రెండు పథకాల నిధుల విడుదల కోసం బటన్లు నొక్కానని, పది రోజుల్లోగా ఆ నిధులు వస్తాయన్నారు. వారం, పదిరోజుల్లోనే గతంలో డబ్బులు పడేవని, ఎన్నికల కోడ్ వచ్చేస్తుందనే ముందే బటన్‌ నొక్కానని సిస్టమ్ ఆన్‌లో ఉండటానికి అలా చేయాల్సి వచ్చిందన్నారు. నిధుల విడుదలపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు నమ్మొద్దన్నారు.

ఎర్రగుంట్లలో అందరికి లబ్ది…

ఎర్రగుంట్ల పరిధిలో1496 ఇళ్లలో 1391 ఇళ్లకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధి అందుకున్నారని చెప్పారు. వివిధ పథకాల ద్వారా 93.06 శాతం మందికి లబ్ధి చేకూర్చామన్ని, 58 నెలల్లో ఎర్రగుంట్ల ప్రజలు ఎంతో లబ్ధి పొందారని జగన్ గణాంకాలతో వివరించారు.

ఒక్క ఎర్రగుంట్ల గ్రామంలోనే రూ.48.74 కోట్లు నేరుగా అందించామన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయని, గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారి పోయాయన్నారు.

ఎంపిక చేసిన వారికే సలహాలిచ్చే అవకాశం…

ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోడానికి సలహాలివ్వాలని వాటిని వినడానికి తాను సిద్ధంగా ఉన్నాను ఎర్రగుంట్లలో సిఎం జగన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సూచనలు,సలహాలు ఇచ్చే క్రమంలో చోటా మోటా నాయకులకు నిర్వాహకులు టోకెన్లు జారీ చేశారు. వారంతా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడానికి ప్రాధాన్యత ఇచ్చారు. వారి పొగడ్తలను ముఖ్యమంత్రి సైతం ఎంజాయ్ చేసినట్టు కనిపించారు.

21రోజుల పాటు 21పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ప్రతి రోజు అయా పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలోని ప్రజలు,నాయకులతో ముఖాముఖి మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని కూడా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తేలా రూపొందించడంతో ముఖ్యమంత్రికి ప్రజల అభిప్రాయం తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకులకు సిఎం దర్శనమే దక్కడం లేదనే విమర్శ ఉంది. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళుతున్న సమయంలో కూడా వారిని నేరుగా ఆయన వద్దకు చేరుకునే అవకాశం లేకుండా కట్టడి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో జగన్ పాదయాత్రలు చేసిన సమయంలో ఎవరైనా నేరుగా ఆయనతో చేతులు కలిపి అడుగులు వేసే అవకాశం ఉండేదని, వారి సమస్యలు, ఇబ్బందులు, సలహాలు స్వీకరించే వారని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 58 నెలల తర్వాత ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పర్యటనల్లో మాత్రం ఆ లోపం కనిపిస్తోందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

 

తదుపరి వ్యాసం