Asia Cup: పాకిస్థాన్ తో పోరుకు టీమిండియా సిద్ధం ...రోహిత్ సేన శ్రీలంక వెళ్లేది ఎప్పుడంటే....
28 August 2023, 10:50 IST
Asia Cup: ఆసియా కప్ సమరాన్ని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా మొదలుపెట్టబోతున్నది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్లేయర్స్ మంగళవారం కొలంబో ప్రయాణం కానున్నట్లు సమాచారం.
టీమ్ ఇండియా
Asia Cup: ఆసియా కప్ సమరం మరో రెండు రోజుల్లో మొదలుకానుంది. ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‌లోనే టీమ్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2న పల్లెకెలె వేదికగా ఆసియా కప్ మ్యాచ్ జరుగనుంది.
పాకిస్థాన్‌తో జరుగనున్న మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు మిగిలిన ప్లేయర్స్ మొత్తం నెట్స్‌లో కఠిన సాధన చేస్తున్నారు.
ఆసియా కప్‌లో టీమ్ ఇండియా ఆడనున్న మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం టీమ్ ఇండియా ప్లేయర్స్ మంగళవారం కొలంబో వెళ్లనున్నట్లు సమాచారం. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడిన బుమ్రా, తిలక్ వర్మతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు ఇంకా ఆసియా కప్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదని తెలిసింది.
సోమవారం నుంచి బుమ్రా పాక్టిస్ సెషన్స్‌లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం అందువల్లే టీమీండియా కొలంబో ప్రయాణం ఆలస్యమైనట్లు సమాచారం. గాయంతో చాలా కాలం పాటు జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్నట్లు తెలిసింది.
వారి ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే టీమ్ ఇండియా కొలంబో ప్రయాణం ఆలస్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడబోతున్నది. ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.