తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India For South Africa Tour: వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్‌కు కెప్టెన్సీ.. రోహిత్, కోహ్లిలకు రెస్ట్

Team India for South Africa Tour: వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్‌కు కెప్టెన్సీ.. రోహిత్, కోహ్లిలకు రెస్ట్

Hari Prasad S HT Telugu

30 November 2023, 20:25 IST

google News
    • Team India for South Africa Tour: సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ లకు రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇచ్చారు. వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఉండనున్నారు.
టీ20, వన్డే సిరీస్ లకు కెప్టెన్లుగా సూర్యకుమార్, కేఎల్ రాహుల్
టీ20, వన్డే సిరీస్ లకు కెప్టెన్లుగా సూర్యకుమార్, కేఎల్ రాహుల్ (PTI)

టీ20, వన్డే సిరీస్ లకు కెప్టెన్లుగా సూర్యకుమార్, కేఎల్ రాహుల్

Team India for South Africa Tour: సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమిండియా టీ20, వన్డే, టెస్టు జట్లను బీసీసీఐ గురువారం (నవంబర్ 30) అనౌన్స్ చేసింది. మొదట జరగబోయే టీ20, వన్డే సిరీస్ ల నుంచి తమను మినహాయించాల్సిందిగా రోహిత్ శర్మ, కోహ్లి కోరినట్లు బోర్డు వెల్లడించింది. దీంతో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఉండనున్నారు.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు రోహిత్, కోహ్లి తిరిగి రానున్నారు. ఇక పేస్ బౌలర్ మహ్మద్ షమి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని, అతడు పూర్తి ఫిట్ గా ఉంటే టెస్టులకు తిరిగి వస్తాడని బీసీసీఐ తెలిపింది. సౌతాఫ్రికాతో డిసెంబర్, జనవరిలో జరగబోయే మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం ఢిల్లీలో గురువారం సమావేశమైన సెలక్షన్ కమిటీ మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.

ఇండియన్ వన్డే జట్టులోని తొలిసారి సాయి సుదర్శన్ కు చోటు దక్కింది. ఇక రజత్ పటీదార్, రింకు సింగ్, సంజూ శాంసన్ లాంటి వాళ్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమ్ ఇదే

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమ్ ఇదే

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్, అర్ష్‌దీప్, సిరాజ్

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, షమి, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

తదుపరి వ్యాసం