World Cup 2023 Winner: వరల్డ్ కప్ గెలిచేది ఆ దేశమే.. భారత్, ఆసిస్ కాదు.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
01 October 2023, 13:27 IST
Sunil Gavaskar About WC Winner: వన్డే వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. ఇప్పటికే అనేక జట్లు ఇండియాకు చేరుకోగా.. వామప్ మ్యాచ్‌లు సైతం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023 వరల్డ్ కప్పును గెలిచేది అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ కాదంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు చేశారు.
వరల్డ్ కప్ గెలిచేది ఆ దేశమే.. భారత్, ఆసిస్ కాదు: సునీల్ గవాస్కర్
Sunil Gavaskar On World Cup 2023 Winning Team: ప్రపంచ కప్ 2023 కోసం సర్వం సిద్ధం అవుతున్నాయి. ఇందులో పాల్గొనే దేశాల క్రికెట్ జట్లు కూడా తలపడేందుకు రెడీ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 న ప్రారంభమయ్యే వరల్డ్ కప్ 2023 టోర్నీ సుమారు నెలన్నర పాటు సాగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో 10 దేశాలు పాల్గొననున్నాయి. ఆ దేశాల క్రికెట్ టీమ్స్ ఇప్పటికే ఇండియాకు చేరుకున్నాయి.
ఊహించని కామెంట్స్
అయితే స్వదేశంలో వరల్డ్ కప్ జరగనుండటంతో ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంటుందని ఇండియన్స్ ఆకాంక్షిస్తున్నారు. అంచనాలు సైతం భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ భారత్‌కు కాకుండా మరో దేశం సొంతం చేసుకుంటుందని ఇండియన్ దిగ్గజ క్రికెట్ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఊహించని కామెంట్స్ చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పటిష్టంగా టీమ్
ఓ స్పోర్ట్ ఛానెల్‌లో పాల్గొన్న సునీల్ గవాస్కర్ వరల్డ్ కప్ గెలిచే సత్తా భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లకు లేదన్నట్లుగా తగిన కారణాలతో వివరించారు. "వన్డే వరల్డ్ కప్ 2023ని డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే, ఆ జట్టులో నాణ్యమైన ప్లేయర్స్ ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో వారు పటిష్టంగా ఉన్నారు. టెర్రిఫిక్ బౌలింగ్ లైనప్ ఇంగ్లాండ్ జట్టు సొంతం" అని సునీల్ గవాస్కర్ తెలిపారు.
బ్యాటింగ్‌కు తిరుగులేదు
"ప్రపంచస్థాయి ఆల్‌రౌండర్స్ ఇంగ్లాండ్ జట్టులో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్‌కు తిరుగులేదు. ఈ కారణాల దృష్ట్యా ఇంగ్లాండ్ జట్టే ఈసారి కప్పు గెలుచుకుంటుంది" అని దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరల్డ్ కప్ రికార్డ్స్
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు 12 సార్లు వన్డే వరల్డ్ కప్ జరిగింది. మొదటి రెండు సార్లు 1975, 1979లలో వెస్టిండీస్ ట్రోఫీ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో భారత్ కప్పు కొట్టింది. 1987లో ఆస్ట్రేలియా, 1992లో పాకిస్తాన్, 1996లో శ్రీలంక దేశాలు వరల్డ్ కప్ గెలుచుకున్నాయి.
అనంతరం 1999, 2003, 2007లో వరుసగా మూడుసార్లు ఆస్ట్రేలియా విన్నర్ అయింది. ఇక 2011లో ఇండియా కప్పు సాధించగా.. 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ గెలుచుకున్నాయి. ఒకవేళ సునీల్ గవాస్కర్ చెప్పినట్లు వరల్డ్ కప్ 2023 ట్రోఫీని ఇంగ్లాండ్ గెలుచుకుంటే వరుసగా రెండు సార్లు కప్పు సొంతం చేసుకున్న మూడో జట్టుగా ఇంగ్లాండ్ నిలవనుంది.
టాపిక్