BCCI Awards: గిల్, మంధాన నుంచి రవిశాస్త్రి వరకు.. నాలుగేళ్లకు అవార్డులను ప్రకటించిన బీసీసీఐ.. లిస్ట్ ఇదే
23 January 2024, 22:08 IST
- BCCI Awards 2024: వివిధ విభాగాల్లో అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. పురుషులు, మహిళా ప్లేయర్లకు అవార్డులు ఇచ్చింది. గత నాలుగేళ్లకు అవార్డులు ప్రకటించింది. ఆ ఫుల్ లిస్ట్ ఇక్కడ చూడండి.
బీసీసీఐ అవార్డుల సందర్భంగా ఫొటోకు పోజిచ్చిన భారత ప్లేయర్లు
BCCI Awards 2024: గత నాలుగేళ్లకు గాను ప్లేయర్లతో పాటు వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). నేడు (జనవరి 23) హైదరాబాద్‍లో ఈ అవార్డు వేడుక గ్రాండ్‍గా జరిగింది. పురుషులు, మహిళా ప్లేయర్లకు అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. ఈ వేడుకకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా చాలా మంది ప్లేయర్స్, మాజీలు హాజరయ్యారు. 2019 నుంచి అవార్డుల వేడుకను బీసీసీఐ నిర్వహించలేదు. దీంతో ఒకేసారి నాలుగేళ్లకు ఇప్పుడు అవార్డును ఇచ్చింది. శుభ్‍మన్ గిల్, మహమ్మద్ షమీ, స్మృతి మంధాన, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సహా మరికొందరికి వివిధ విభాగాల్లో అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. ఆ లిస్ట్ ఇదే.
2022-23కు గాను అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా శుభ్‍మన్ గిల్‍కు అవార్డు దక్కింది. అంతకు ముందు ఏడాదికి గాను జస్‍ప్రీత్ బుమ్రాకు ఈ పురస్కారం వచ్చింది. గత నాలుగేళ్లలో రెండేళ్లు అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి మంధాన అందుకున్నారు. రవిశాస్త్రి సహా మరో మాజీ ఆటగాడికి లైఫ్ టైమ్ అచీవ్‍మెంట్ అవార్డు వచ్చింది. బెస్ట్ డెబ్యూట్, అత్యధిక పరుగులు సహా మరిన్ని కేటగీరీలకు కూడా అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. ఆ వివరాలు ఇవే.
అవార్డుల లిస్ట్ ఇదే
అత్యుత్తమ (బెస్ట్) అంతర్జాతీయ క్రికెటర్ (పురుషులు) - పాలీ ఉమ్రిగర్ అవార్డు
2019-20: మహమ్మద్ షమీ
2020-21: రవిచంద్రన్ అశ్విన్
2021-22: జస్‍ప్రీత్ బుమ్రా
2022-23: శుభ్‍మన్ గిల్
అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) - పాలీ ఉమ్రిగర్ అవార్డు
2019-20: దీప్తి శర్మ
2020-21: స్మృతి మంధాన
2021-22: స్మృతి మంధాన
2022-23: దీప్తి శర్మ
అత్యుత్తమ అంతర్జాతీయ డెబ్యూట్ (పురుషులు)
2019-20: మయాంక్ అగర్వాల్
2020-21: అక్షర్ పటేల్
2021-22: శ్రేయస్ అయ్యర్
2022-23: యశస్వి జైస్వాల్
అత్యుత్తమ అంతర్జాతీయ డెబ్యూట్ (మహిళలు)
2019-20: ప్రియా పునియా
2020-21: షెఫాలీ వర్మ
2021-22: సబ్బెనేని మేఘన
2022-23: అమన్‍జోత్ కౌర్
సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‍మెంట్ అవార్డు:
రవిశాస్త్రి,
ఫరూఖ్ ఇంజినీర్
దిలీప్ సర్దేశాయ్ అవార్డు
అత్యధిక టెస్టు వికెట్లు - 2022 - 23 (భారత్ వర్సెస్ వెస్టిండీస్): రవి చంద్రన్ అశ్విన్
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు - 2022-23 (భారత్ వర్సెస్ వెస్టిండీస్): యశస్వి జైస్వాల్
వన్డేల్లో అత్యధిక పరుగులు (మహిళలు)
2019-20: పూనమ్ రౌత్
2020-21: మిథాలీ రాజ్
2021-22: హర్మన్‍ప్రీత్ కౌర్
2022-23: జెమీమా రోడ్రిగ్స్
వన్డేల్లో అత్యధిక వికెట్లు (మహిళలు)
2019-20: పూనమ్ యాదవ్
2020-21: జులన్ గోస్వామి
2021-22: రాజేశ్వరి గైక్వాడ్
2022-23: దేవిక వైద్య
స్టేట్ అసోసియేషన్ అత్యుత్తమ పర్ఫార్మెన్స్
2019-20: ముంబై
2021-22: మధ్యప్రదేశ్
2022-23: సౌరాష్ట్ర
దేశవాళీ క్రికెట్‍లో బెస్ట్ ఆల్‍రౌండర్
2019-20: బాబా అపరాజిత్
2020-21: రిషి ధావన్
2021-22: రిషి ధావన్
2022-23: రియాన్ పరాగ్
దేశవాళీ క్రికెట్‍లో బెస్ట్ అంపైర్
2019-20: పి.పద్మనాభన్
2020-21: వృంద రాథి
2021-22: జయరామన్ మదన్‍గోపాల్
2022-23: రోహన్ పండిట్
టాపిక్