తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. మెగా వేలంలోకి మాజీ కెప్టెన్.. షాకింగ్ న్యూస్!

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. మెగా వేలంలోకి మాజీ కెప్టెన్.. షాకింగ్ న్యూస్!

Hari Prasad S HT Telugu

04 April 2024, 20:23 IST

    • Rohit Sharma: ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోనున్నట్లు షాకింగ్ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మాజీ కెప్టెన్ ఈ ఏడాది చివర్లో జరిగే మెగా వేలంలో పాల్గొననున్నట్లు కూడా సమాచారం.
ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. మెగా వేలంలోకి మాజీ కెప్టెన్.. షాకింగ్ న్యూస్!
ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. మెగా వేలంలోకి మాజీ కెప్టెన్.. షాకింగ్ న్యూస్! (PTI)

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. మెగా వేలంలోకి మాజీ కెప్టెన్.. షాకింగ్ న్యూస్!

Rohit Sharma: ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇక ఆ ఫ్రాంఛైజీకి గుడ్ బై చెప్పనున్నాడా? హార్దిక్ కెప్టెన్సీతో అతడు అసంతృప్తితో ఉన్నాడా? రాబోయే మెగా వేలంలో అతడు కూడా పాల్గొంటాడా? తాజాగా న్యూస్ 24 రిపోర్ట్ ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత ముంబై ఫ్రాంఛైజీ నుంచి రోహిత్ తప్పుకోనున్నట్లు ఆ రిపోర్ట్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RR: చెపాక్‍లో చెన్నై తఢాకా.. రాజస్థాన్‍పై సునాయాస గెలుపు.. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగు

MS Dhoni : సీఎస్కే వర్సెస్​ ఆర్​ఆర్​.. చెపాక్​లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్​!

IPL 2024 playoffs scenario : సీఎస్కే, డీసీ, ఆర్సీబీలో ప్లేఆఫ్స్​కి వెళ్లే జట్టు ఏది?

KKR vs MI IPL 2024: సూపర్ విక్టరీతో ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా.. ముంబైకు మరో పరాభవం

రోహిత్ శర్మ vs హార్దిక్ పాండ్యా

ఈ ఏడాది ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై రోహిత్ గరంగరంగా ఉన్నాడట. అంతేకాదు అతని కెప్టెన్సీ జట్టులోనూ విభేదాలు సృష్టించిందని, ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ గెలవకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని న్యూస్ 24 రిపోర్ట్ వెల్లడించింది. డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి ఏమీ బాగాలేదని, రోహిత్, హార్దిక్ మధ్య ఎన్నో వాగ్వాదాలు జరుగుతున్నట్లు ఓ ప్లేయర్ చెప్పినట్లు ఆ రిపోర్ట్ చెప్పింది.

గతేడాది రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించినప్పటి నుంచీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ గాడి తప్పింది. ఈ నిర్ణయంపై రోహిత్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు కానీ అభిమానులు మాత్రం ఫ్రాంఛైజీపై దుమ్మెత్తిపోశారు. రోహిత్ భార్య రితికా కూడా ఇది సరికాదంటూ ఓ ఇన్‌స్టా పోస్టుపై కామెంట్ చేసింది.

మెగా వేలంలో రోహిత్

ఈ సీజన్ తర్వాత ముంబైని వదిలేయడంతోపాటు వచ్చే మెగా వేలంలోనూ రోహిత్ శర్మ పాల్గొంటాడని ఆ రిపోర్ట్ మరో సంచలన విషయం చెప్పింది. అదే నిజమైతే మాత్రం రోహిత్ కోసం ఎన్ని ఫ్రాంఛైజీలు పోటీ పడతాయో.. ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి. ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన కెప్టెన్లో రోహిత్ ఒకడు. ఇప్పటికీ ఇండియన్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు.

ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. అలాంటి ప్లేయర్ ను అసలు ముంబై వదులుకుంటుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తేనే లక్షల మంది ఫ్యాన్స్ ఆ టీమ్ ను అన్ ఫాలో చేశారు. ఇప్పుడు మొత్తానికే తప్పుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ బ్రాండ్ చాలా దెబ్బ తింటుందనడంలో సందేహం లేదు.

హార్దిక్ పాండ్యాకు అల్టిమేటం

మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్లో మొదటి మూడు మ్యాచ్ లలోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఒత్తిడిలో ఉన్నాడు. దీంతో ఫ్రాంఛైజీ అతనికి కూడా అల్టిమేటం ఇచ్చినట్లు సదరు రిపోర్ట్ తెలిపింది. మరో రెండు మ్యాచ్ లు అవకాశం ఇచ్చి.. అతన్ని సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచన కూడా ఫ్రాంఛైజీ చేస్తున్నట్లు సమాచారం.

టీమ్ లోని ప్లేయర్స్, అభిమానులు ఎవరూ హార్దిక్ కెప్టెన్సీతో సంతృప్తిగా లేరు. ఇది అతనిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో రానున్న మ్యాచ్ లలో అతడు ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. గుజరాత్ టైటన్స్ లాంటి కొత్త జట్టును విజయవంతంగా నడిపిన హార్దిక్ కు ఇది నిజంగా పెద్ద సవాలే.

తదుపరి వ్యాసం