తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant Ban : ఐపీఎల్​లో నిషేధానికి అడుగు దూరంలో రిషభ్​ పంత్​.. కారణం ఇదే!

Rishabh Pant ban : ఐపీఎల్​లో నిషేధానికి అడుగు దూరంలో రిషభ్​ పంత్​.. కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu

05 April 2024, 6:35 IST

    • Rishabh Pant DC : ఐపీఎల్​ 2024లో ఒక మ్యాచ్​ నిషేధానికి అడుగు దూరంలో ఉన్నాడు దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషభ్​ పంత్​. ఇదే జరిగితే.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న డీసీకి షాక్​ తగిలినట్టే!
డీసీ కెప్టెన్​ రిషభ్​ పంత్​పై నిషేధం తప్పదా?
డీసీ కెప్టెన్​ రిషభ్​ పంత్​పై నిషేధం తప్పదా? (ANI)

డీసీ కెప్టెన్​ రిషభ్​ పంత్​పై నిషేధం తప్పదా?

Rishabh Pant IPL ban : కోల్​కతా నైట్​ రైడర్స్​​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో ఓటమి పాలైన దిల్లీ క్యాపిటల్స్​కి మరో షాక్​ తగిలేడట్టు ఉంది! ఐపీఎల్​ 2024లో వరుస ఓటములతో పాయింట్స్​ టేబుల్​లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఈ జట్టు కెప్టెన్​ రిషభ్​ పంత్​పై నిషేధం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దిల్లీ క్యాపిటల్స్​ జట్టు స్లో ఓవర్​ రేట్​ వ్యవహారమే ఇందుకు కారణం. ఇదే విషయంలో పంత్​పై భారీగా ఫైన్​ పడింది.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

రిషభ్​ పంత్​పై నిషేధం తప్పదా..?

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని ఐపీఎల్​ 2024లో ఎంట్రీ ఇచ్చాడు రిషభ్​ పంత్​. ప్లేయర్​గా పర్లేదు అనిపిస్తున్నాడు. కానీ డీసీని స్లో ఓవర్​ రేట్​ సమస్య వెంటాడుతోంది. బుధవారం కేకేఆర్​​తో జరిగిన మ్యాచ్​ ముగిసిన తర్వాత.. పంత్​పై రూ. 24 లక్షల ఫైన్​ పడింది. స్లో ఓవర్​ రేట్​ కారణంగా పంత్​పై ఇలాంటి ఫైన్​ పడటం.. ఐపీఎల్​ 2024లో ఇది రెండోసారి. ఇక మిగిలిన జట్టు సభ్యులపై 25శాతం ఫైన్​ పడింది.

"టాటా ఐపీఎల్​ 2024లో కేకేఆర్​ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ కారణంగా దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషభ్​ పంత్​పై ఫైన్​ పడింది," అని ఓ స్టేట్​మెంట్​ ఇచ్చింది ఇపీఎల్​.

DC vs KKR highlights : "రెండో స్లో ఓవర్​ రేట్​ ఫైన్​ కావడంతో పంత్​పై రూ. 24 లక్షల జరిమానా పడింది. ఇంపాక్ట్​ ప్లేయర్​ సహా జట్టులోని మిగిలిన వారిపై రూ. 6 లక్షలు లేదా 25శాతం ఫైన్​ పడింది," అని ఐపీఎల్​ పేర్కొంది.

కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ 106 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కేకేఆర్​ జట్టు 272 పరుగులు చేసింది. ఐపీఎల్​ చరిత్రలో ఇది రెండో అత్యధికం. ఇది.. రిషభ్​ పంత్​ నేతృత్వంలోని దిల్లీ క్యాపిటల్స్​కి 4 మ్యాచ్​లలో మూడో ఓటమి.

ఇక ఐపీఎల్​ రూల్స్​ ప్రకారం.. మూడోసారి కూడా స్లో ఓవర్​ రేట్​ కనిపిస్తే.. సంబంధిత జట్టు కెప్టెన్​పై రూ. 30లక్షల ఫైన్​తో పాటు ఒక మ్యాచ్​లో నిషేధం పడుతుంది. జట్టులోని ఇతర సభ్యులపై రూ. 12లక్షలు లేదా మ్యాచ్​ ఫీజులో 50శాతం ఫైన్​ పడుతుంది.

Rishabh Pant IPL 2024 : ఐపీఎల్​ 2024లో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న డీసీ జట్టుకు.. రిషభ్​ పంత్​ దూరమైతే మరిన్ని కష్టాలు తప్పవు. అందుకే.. పంత్​, రానున్న మ్యాచ్​లలో ఈ స్లో ఓవర్​ రేట్​ వ్యవహారాన్ని కచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఆడాలి.

ముంబై ఇండియన్స్​తో దిల్లీ క్యాపిటల్స్​ తదుపరి మ్యాచ్​ ఉంటుంది. ముంబై వేదికగా.. ఆదివారం మధ్యాహ్నం ఈ మ్యాచ్​ జరుగుతుంది.

తదుపరి వ్యాసం