Urvashi Rautela Trolls Rishabh Pant: నా హైట్ కూడా లేవు: రిషబ్ పంత్‌ను మరోసారి దారుణంగా ట్రోల్ చేసిన బాలీవుడ్ నటి
Urvashi Rautela Trolls Rishabh Pant: టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను మరోసారి దారుణంగా ట్రోల్ చేసింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. ఆమె వీడియో వైరల్ అవుతోంది.
Urvashi Rautela Trolls Rishabh Pant: రిషబ్ పంత్ పై మరోసారి నోరు పారేసుకుంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. ఈసారి అతని హైట్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రోల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల కిందట తొలిసారి వీళ్ల మధ్య సోషల్ మీడియా వార్ జరగగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఊర్వశి ఇలాంటి కామెంట్స్ చేయడం అభిమానులు ఆగ్రహానికి గురి చేస్తోంది.
పంత్‌పై నోరు పారేసుకున్న ఊర్వశి
బాలీవుడ్ తోపాటు తెలుగులో వాల్తేర్ వీరయ్య, బ్రోలాంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసిన నటి ఊర్వశి రౌతేలా. ఆమెతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఏదో నడుస్తోందన్న పుకార్లు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ముంబైలో ఒకసారి ఈ ఇద్దరూ కలిసి కనిపించారు. అయితే తర్వాత ఏమైందోగానీ ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు.
అప్పటి నుంచీ పంత్ ను లక్ష్యంగా చేసుకొని ఊర్వశి ఏదో ఒకరకంగా ట్రోల్ చేస్తూనే ఉంది. పలు ఇంటర్వ్యూల్లోనూ పరోక్షంగా అతనిపై పంచ్ లు వేసింది. ఇక ఇప్పుడు ఆమె తన లవ్, డేటింగ్ జీవితంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులోనూ పరోక్షంగా ఆమె పంత్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది.
తాను యాక్టర్స్ తోపాటు వ్యాపారవేత్తలు, సింగర్లు, బ్యాట్స్‌మెన్ తోనూ డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. బ్యాట్స్‌మెన్ అని అన్న తర్వాత అందులో కొందరు నా హైట్ కూడా లేరు అని ఊర్వశి అనడం గమనార్హం. అది కచ్చితంగా రిషబ్ పంత్ ను ఉద్దేశించే చేసిన కామెంట్స్ అని నెటిజన్లు ఫిక్సయిపోయారు. అప్పటి నుంచీ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు.
పంత్ వర్సెస్ ఊర్వశి
గతంలో ఒకసారి పంత్ పేరు ప్రస్తావించకుండానే అతడు తనతో డేటింగ్ చేయాలని అనుకున్నాడని, తనను ఇష్టపడ్డాడని ఊర్వశి చెప్పింది. దీనిపై పంత్ కూడా స్పందించాడు. కొందరు మరీ ఎంతకైనా దిగజారతారని, ఇంటర్వ్యూల్లో ఏది పడితే అది వాగేస్తుంటారని మండిపడ్డాడు. దీనికి కూడా రౌతేలా స్పందించడంతో ఎందుకు అక్కా నా వెంట పడ్డావ్ అని పంత్ మరింత ఘాటుగా జవాబిచ్చాడు.
అయితే ఇన్నాళ్లకు మళ్లీ పంత్ ను పరోక్షంగా ఊర్వశి ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చిందో మాత్రం అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడి.. సుమారు 15 నెలల తర్వాత మళ్లీ క్రికెట్ లోకి అడుగుపెట్టిన వేళ అతనిపై ఇలాంటి కామెంట్స్ చేయడం అభిమానులకు రుచించడం లేదు. ఆదివారమే (మార్చి 31) చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తన కమ్‌బ్యాక్ లో అతడు తొలి హాఫ్ సెంచరీ కూడా చేశాడు.
సీఎస్కేపై అతడు కేవలం 32 బంతుల్లోనే 51 రన్స్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్ లో చెన్నైని డీసీ చిత్తు చేసింది. గతంలో టెస్టుల్లో టీమిండియాకు ఎన్నో చరిత్రాత్మక విజయాలను కూడా సాధించి పెట్టాడు. అతడు ఐపీఎల్లో రాణించి టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.