తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Pbks: పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ రికార్డు ఇదీ.. సొంతగడ్డపై అయినా కోహ్లి అండ్ టీమ్ చెలరేగుతుందా?

RCB vs PBKS: పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ రికార్డు ఇదీ.. సొంతగడ్డపై అయినా కోహ్లి అండ్ టీమ్ చెలరేగుతుందా?

Hari Prasad S HT Telugu

25 March 2024, 11:57 IST

    • RCB vs PBKS: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కే చేతుల్లో ఓడిన ఆర్సీబీ..తన రెండో మ్యాచ్ లో సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. అందరి కళ్లూ మరోసారి విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ రికార్డు ఇదీ.. సొంతగడ్డపై అయినా కోహ్లి అండ్ టీమ్ చెలరేగుతుందా?
పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ రికార్డు ఇదీ.. సొంతగడ్డపై అయినా కోహ్లి అండ్ టీమ్ చెలరేగుతుందా? (ANI )

పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ రికార్డు ఇదీ.. సొంతగడ్డపై అయినా కోహ్లి అండ్ టీమ్ చెలరేగుతుందా?

RCB vs PBKS: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త ఐపీఎల్ సీజన్ కు కొత్త జెర్సీ, కొత్త పేరుతో వచ్చినా తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటమి తప్పలేదు. ఇక ఇప్పుడు తమ సొంతగడ్డపై బెంగళూరులో ఆ టీమ్ పంజాబ్ కింగ్స్ తో రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. మరోసారి అందరి కళ్లూ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ఆర్సీబీ వెర్సెస్ పీబీకేఎస్

చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లో టీ20ల్లో 12 వేల పరుగులతో విరాట్ కోహ్లి తన వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు కానీ ఆ జట్టుకు మాత్రం నిరాశ తప్పలేదు. అనూజ్ రావత్, దినేష్ కార్తీక్ లాంటి వాళ్ల పోరాటం వృథా అయిపోయింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆ టీమ్ కు కొత్త సీజన్లోనూ ఓటమే స్వాగతం పలికింది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో గత రికార్డులు చూసినా, ప్రస్తుత ఫామ్ చూసినా.. ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. సొంత మైదానంలో ఆడుతుండటమే ఆర్సీబీకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

ఆర్సీబీ వెర్సెస్ పీబీకేఎస్ రికార్డులు

ఐపీఎల్లో ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ దే పైచేయిగా ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకూ ఆర్సీబీపై 17 విజయాలు సాధించింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 14 మ్యాచ్ లలోనే గెలిచింది. ఈసారి ఐపీఎల్లో తొలి రౌండ్ మ్యాచ్ లు పూర్తయిన తర్వాత ఆర్సీబీ 9, పంజాబ్ కింగ్స్ మూడోస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

ఇక టీమ్ రికార్డు అంత బాగా లేకపోయినా.. పీబీకేఎస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పై మాత్రం విరాట్ కోహ్లికి మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో ఒక్కసారి కూడా కోహ్లిని అర్ష్‌దీప్ ఔట్ చేయలేదు. మరోవైపు కోహ్లి మాత్రం అతని బౌలింగ్ లో 23 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. అయితే మరో పీబీకేఎస్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ మాత్రం కోహ్లిని రెండుసార్లు, మ్యాక్స్‌వెల్ ను మూడుసార్లు ఔట్ చేశాడు.

ఆర్సీబీకి అందరి కంటే పెద్ద ముప్పు పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడా ద్వారానే ఉందని చెప్పొచ్చు. అతడు డుప్లెస్సిని 2సార్లు, కోహ్లిని 3 సార్లు, మ్యాక్స్‌వెల్ ను రెండుసార్లు, దినేష్ కార్తీక్ ని మూడుసార్లు ఔట్ చేశాడు. ఇక ఆర్సీబీ బౌలర్లు సిరాజ్, కర్ణ్ శర్మలాంటి వాళ్లపై పంజాబ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు 200కుపైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఇవన్నీ ఆర్సీబీని కాస్త ఆందోళనకు గురి చేసేవే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ సోమవారం (మార్చి 25) రాత్రి 7.30 గంటలకు ప్రారంభవుతుంది. జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

తదుపరి వ్యాసం