(1 / 6)
సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌కు చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఇరవై ఓవర్లలో 173 పరుగులు చేసింది. 18.4 ఓవర్లలోనే 176 పరుగులతో చెన్నై ఈజీగా టార్గెట్‌ను ఛేదించింది.
(2 / 6)
రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్‌గా బరిలో దిగిన కోహ్లి 20 బాల్స్‌లో 21 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక సిక్స్ ఉంది.
(3 / 6)
78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీను అనుజ్ రావత్, కార్తిక్ ఆదుకున్నారు. అనుజ్ 48 రన్స్, కార్తిక్ 38 రన్స్ చేయడంతో ఆర్‌సీబీ 173 పరుగులు చేసింది.
(4 / 6)
ఆరంభంలో రచిన్ రవీంద్ర, చివరలో శివమ్ దూబే మెరుపులతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చెన్నై టార్గెట్‌ను ఛేదించింది.
(5 / 6)
చెన్నై పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
(6 / 6)
ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌కు ధోనీ, కోహ్లి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కోహ్లి, ధోనీ అంటూ అభిమానుల నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది.
ఇతర గ్యాలరీలు