తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ravindra Jadeja Records: సెంచరీతో షేన్ వార్న్ సరసన నిలిచిన రవీంద్ర జడేజా.. టీమిండియా ఆల్ రౌండర్ అరుదైన రికార్డు

Ravindra jadeja Records: సెంచరీతో షేన్ వార్న్ సరసన నిలిచిన రవీంద్ర జడేజా.. టీమిండియా ఆల్ రౌండర్ అరుదైన రికార్డు

Hari Prasad S HT Telugu

15 February 2024, 19:14 IST

    • Ravindra jadeja Records: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు సెంచరీతో రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు షేన్ వార్న్, డేనియల్ వెటోరీల సరసన నిలవడం విశేషం.
రాజ్‌కోట్ టెస్టులో సెంచరీతో షేన్ వార్న్ సరసన నిలిచిన రవీంద్ర జడేజా
రాజ్‌కోట్ టెస్టులో సెంచరీతో షేన్ వార్న్ సరసన నిలిచిన రవీంద్ర జడేజా (AP)

రాజ్‌కోట్ టెస్టులో సెంచరీతో షేన్ వార్న్ సరసన నిలిచిన రవీంద్ర జడేజా

Ravindra jadeja Records: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకొని రాగానే మరోసారి చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టెస్టుల్లో అతడు నాలుగో సెంచరీ చేశాడు. తన స్వస్థలమైన రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా గ్రౌండ్‌లో జడేజా కొన్ని రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన జడ్డూ.. ఇన్నింగ్స్ 82వ ఓవర్లో సెంచరీ పూర్తి చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

జడేజా రికార్డులు ఇవే..

- 2022 నుంచి మిడిలార్డర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా. జడ్డూ 3 సెంచరీలు చేయగా.. రిషబ్ పంత్, విరాట్ కోహ్లి రెండేసి సెంచరీలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

- రవీంద్ర జడేజా సెంచరీ చేయడం ద్వారా టెస్టుల్లో 3000 పరుగులు సాధించాడు. దీంతో టెస్టుల్లో 3,000 పరుగులు, 200 వికెట్లు సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు కపిల్ దేవ్ (5248 పరుగులు, 434 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (3271 పరుగులు, 499 వికెట్లు) ఈ ఘనత సాధించగా.. ప్రస్తుతం రవీంద్ర జడేజా 3003 పరుగులు, 280 వికెట్లతో ఉన్నాడు.

షేన్ వార్న్ సరసన జడేజా

టెస్ట్ క్రికెట్ లో గతంలో ఇలా 3 వేల పరుగులు, 250కిపైగా వికెట్లు తీసుకున్న ప్లేయర్స్ ఇంతకుముందు 11 మంది ఉన్నారు. ఇప్పుడు జడేజా కూడా ఆ జాబితాలో చేరాడు. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

షేన్ వార్న్ - 3154 పరుగులు, 708 వికెట్లు

స్టువర్ట్ బ్రాడ్ - 3662 పరుగులు, 604 వికెట్లు

ఆర్ అశ్విన్ - 3271 పరుగులు, 499 వికెట్లు

కపిల్ దేవ్ - 5248 పరుగులు, 434 వికెట్లు

సర్ రిచర్డ్ హ్యాడ్లీ - 3124 పరుగులు, 431 వికెట్లు

షాన్ పొలాక్ - 3781 పరుగులు, 421 వికెట్లు

ఇయాన్ బోథమ్ - 5200 పరుగులు, 383 వికెట్లు

ఇమ్రాన్ ఖాన్ - 3807 పరుగులు, 362 వికెట్లు

డేనియల్ వెట్టోరి - 4531 పరుగులు, 362 వికెట్లు

చమిందా వాస్ - 3089 పరుగులు, 355 వికెట్లు

జాక్వెస్ కలిస్ - 13289 పరుగులు, 292 వికెట్లు

రవీంద్ర జడేజా - 3003 పరుగులు, 280 వికెట్లు

రాజ్‌కోట్‌లో జడేజా షో (ఫస్ట్ క్లాస్ క్రికెట్)

మ్యాచ్‌లు: 12

ఇన్నింగ్స్: 17

పరుగులు: 1564

సగటు : 142.18

50/100 : 04/06

గరిష్ట స్కోరు: 331

నాలుగో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం

ఆట మొదలైన తొలి గంటలోపే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో తనకు వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి బాధ్యతాయుతంగా ఆడుతూ 4 వికెట్ కు ఏకంగా 204 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

జడ్డూ 198 బంతుల్లో టెస్టుల్లో తన నాలుగో సెంచరీ చేశాడు. ఇప్పటికీ జడేజా ఇంకా క్రీజులో ఉండటంతో రెండో రోజు టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. రెండో రోజు అతడు ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే టీమ్ కు అంత భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది.

తదుపరి వ్యాసం