
(1 / 5)
ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్‍ను అశ్విన్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో రికార్డు నెలకొల్పాడు.
(PTI)
(2 / 5)
టెస్టు క్రికెట్‍లో ఇంగ్లండ్‍పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. ఓలీ పోప్‍ను ఔట్ చేసి.. ఇంగ్లండ్‍పై టెస్టుల్లో 96వ వికెట్ దక్కించుకున్నాడు.
(ANI)
(3 / 5)
భారత మాజీ స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ (95 వికెట్లు)ను అధిగమించి టెస్టుల్లో ఇంగ్లండ్‍పై అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు.
(PTI)
(4 / 5)
ఈ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ తర్వాత జో రూట్‍ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టి భారత గెలుపు కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‍గా టెస్టు క్రికెట్‍లో 500 వికెట్లకు ఒక్క వికెట్ దూరంలో అశ్విన్ ఉన్నాడు.
(PTI)
(5 / 5)
విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‍లో 1-1తో నిలిచింది. టీమిండియా, ఇంగ్లిష్ జట్టు మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‍కోట్‍లో జరుగుతుంది.
(ANI)ఇతర గ్యాలరీలు