తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 3rd Odi: వ‌న్డేల్లోకి అరంగేట్రం చేసిన‌ ఐపీఎల్ స్టార్ ర‌జ‌త్ పాటిదార్ - చాహ‌ల్‌కు నిరాశే

IND vs SA 3rd Odi: వ‌న్డేల్లోకి అరంగేట్రం చేసిన‌ ఐపీఎల్ స్టార్ ర‌జ‌త్ పాటిదార్ - చాహ‌ల్‌కు నిరాశే

21 December 2023, 16:39 IST

  • IND vs SA 3rd Odi: సౌతాఫ్రికాతో జ‌రుగుతోన్న మూడో వ‌న్డే ద్వారా ఐపీఎల్ స్టార్ ర‌జ‌త్ పాటిద‌ర్ వ‌న్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మూడు వ‌న్డేల సిరీస్‌లో ప్ర‌స్తుతం టీమిండియా, సౌతాఫ్రికా 1-1 తో స‌మంగా ఉన్నాయి.

చాహల్
చాహల్

చాహల్

IND vs SA 3rd Odi: సౌతాఫ్రికాతో జ‌రుగుతోన్న మూడో వ‌న్డేలో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్‌...భార‌త్‌కు బ్యాటింగ్ అప్ప‌గించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. గాయం కార‌ణంగా రుతురాజ్ గైక్వాడ్ మూడో వ‌న్డేకు దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో ఐపీఎల్ స్టార్ ర‌జ‌త్ పాటిదార్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

ఈ మ్యాచ్‌తోనే వ‌న్డే క్రికెట్‌లోకి ర‌జ‌త్ అరంగేట్రం చేయ‌నున్నాడు. కుల్దీప్ యాద‌వ్ స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. మూడో వ‌న్డేతో చాహ‌ల్ రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ అత‌డికి కాద‌ని సుంద‌ర్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది.ఈ మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో టీమిండియా, సౌతాఫ్రికా స‌మంగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు వ‌న్డే సిరీస్ విజేత‌గా నిల‌వ‌నుంది. దాంతో ఈ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచి సిరీస్ నెగ్గాల‌నే క‌సితో రెండు జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నున్నాయి.

తదుపరి వ్యాసం